స్పాట్ ఫిక్సింగ్ లో వారిద్దరిదే కీలక పాత్ర: కోర్టు
న్యూఢిల్లీ: ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ ప్రత్యేక పాత్ర ఉన్నట్టు దర్యాప్తులో తేలిందని డిల్లీ కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఈకేసులో దావూద్, షకీలిద్దరూ కీలక ముద్దాయిలని, వీరికి సంబంధిచిన ఆస్థుల జప్టు పోలీసులు పూర్తి చేశారని అడిషనల్ సెషన్స్ న్యాయమూర్తి నీనా భన్సాల్ కృష్ణ తెలిపారు.
ఈ కేసులో వీరిద్దరికి నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఆస్తుల జప్తులకు మార్గనిర్ధేశం చేయాలని కోర్టును ఢిల్లీ పోలీసులు కోరారు. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటికే దావూద్, షకీల్ ఆస్తులను జప్తు చేశామని కోర్టుకు పోలీసులు తెలిపారు.