IPS officials
-
నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎస్‌లపై రాజకీయ వేటు
-
TS: పలువురు ఐపీఎస్ అధికారుల పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ లభించింది. రాష్ట్రంలోని 12 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.1997 బ్యాచ్‌కు చెందిన నలుగురు ఐపీఎస్ అధికారులు.. విజయ్ కుమార్, నాగిరెడ్డి, డీఎస్. చోహన్, సంజయ్ కుమార్ జైన్లకు అడిషనల్ డీజీపీగా ప్రమోషన్ దక్కింది. 2005 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులు.. తరుణ్ జోషి, వి.శివ కుమార్, కమలసన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఏఆర్. శ్రీనివాస్‌లకు ఐజీగా పదోన్నతి లభించింది. 2008 బ్యాచ్ కు చెందిన తఫ్సర్ ఇక్బాల్‌కు డీఐజీగా, 2009 బ్యాచ్‌కు చెందిన రేమ రాజేశ్వరి, అంబారి కిషోర్ ఝాలకు సెలెక్షన్స్ గ్రేడ్ ఆఫీసర్స్ కింద ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
ఏపీలో 13 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అవరావతి: ఏపీలో 13 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి , విజిలెన్స్&ఎన్ఫోర్స్మెంట్ (జనరల్ అడ్మిన్) ఎస్పీగా డా.షీమోషి, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్‌దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీగా కోయా ప్రవీణ్.. దీంతో పాటు పీటీవోగా ఆయన అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించనున్నారు. ఇక విజయనగరం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా విక్రాంత్ పాటిల్, డీజీపీ ఆఫీస్‌లో లాండ్ ఆర్డర్ ఏఐజీగా అమ్మిరెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, విజయవాడ రైల్వేస్ ఎస్పీగా రాహుల్‌దేవ్ సింగ్, మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా అజిత వేజెండ్ల, కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్‌గా జీఎస్ సునీల్, విశాఖ డీసీపీ-1గా గౌతమి శాలి , ఇంటెలిజెన్స్ సీఎం ఎస్జీ ఎస్పీగా వకుల్ జిందాల్‌లు బదిలీ అయ్యారు. ఇక నారాయణ్ నాయక్‌కు డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. -
అది బస్తీ దవాఖానా.. కానీ అక్కడికి ఐఏఎస్‌లూ వస్తారు
సాక్షి, బంజారాహిల్స్: తాజా మాజీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ అధికారులతో పాటు సంపన్న వ్యాపార, పారిశ్రామికవేత్తలు తమకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే బడా కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తారని అంతా భావిస్తారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.72లోని ప్రశాసన్‌నగర్‌లో నివసిస్తున్న తాజా, మాజీ బ్యూరోక్రాట్లు మాత్రం తమ కాలనీలో ఉన్న బస్తీ దవాఖానాను సద్వినియోగం చేసుకుంటున్నారు. బీపీ, షుగర్ తదితర పరీక్షలతో పాటు అందుకు సంబంధించిన మందులను కూడా వీరంతా ఈ బస్తీ దవాఖానాలోనే పొందుతున్నారు. వైద్యం కోసం వచ్చిన అధికారి సురేష్ చందా.. 2018 మార్చిలో ఇక్కడ బస్తీ దవాఖానా ఏర్పాటు చేశారు. ఇక్కడున్న సౌకర్యాలతో ఐఏఎస్, ఐపీఎస్‌లు ఆకర్షితులయ్యారు. సమీపంలోనే కార్పొరేట్ వైద్యం లభిస్తుండటంతో మెల్లమెల్లగా అధికారులంతా ఇక్కడే వైద్య సేవలు పొందుతున్నారు. ప్రతిరోజూ 20 నుంచి 30 మంది అధికారులు ఇక్కడ షుగర్, బీపీ పరీక్షలతో పాటు లివర్ ఫంక్షన్ టెస్టులు, రెనాల్ ప్రొఫైల్ టెస్టులు, సీరం కాల్షియం, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. దీంతో బస్తీ దవాఖానా కాస్తా కాలనీ దవాఖానాగా వరిపోయింది. ఇక్కడ సామాన్యులతో పాటు సంపన్నులు వైద్య పరీక్షలు నిర్వహించుకుంటుండటంతో బస్తీ దవాఖానా కార్పొరేట్ ఆస్పత్రి తరహాగా సేవలు అందిస్తోంది. బస్తీ దవాఖానాలో పరీక్షలు చేయించుకుంటున్న ఐపీఎస్ అధికారి ఉమేష్ కుమార్ అన్ని పరీక్షలూ ఇక్కడే.. డ్రైవర్లు, పని మనుషుల కోసం మాత్రమే ఏర్పాటైన బస్తీ దవాఖానాలో లభిస్తున్న వైద్య సేవలు సంపన్నులను సైతం ఆకర్షిస్తున్నాయి. నాణ్యమైన మందులతో పాటు వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండటంతో ప్రతిరోజూ 20 నుంచి 30 మంది వరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పరీక్షల కోసం వస్తున్నారు. ప్రతి వైద్య పరీక్షను ఇక్కడే చేయించుకుంటున్నారు. వీరితో పాటు కాలనీకి చెందిన పని మనుషులు, డ్రైవర్లు, సమీప బస్తీల నుంచి ప్రతిరోజూ 80 నుంచి 100 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. – డాక్టర్ అమూల్య, ప్రశాసన్‌నగర్ బస్తీ దవాఖానా -
ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 14 మందికి స్థానచలనం కల్పిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సంఖ్య ఐపీఎస్ అధికారి పేరు హోదా ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం 1 బాబూజీ అట్టాడ ఎస్పీ కడప విశాఖ రూరల్ 2 రాజశేఖర్ ఎస్పీ చిత్తూరు చిత్తూరు రూరల్ 3 ఐశ్వర్య రాస్తోగి అడిషనల్ ఎస్పీ విశాఖ రూరల్ నెల్లూరు(ఎస్పీ) 4 ఫకీరప్ప డీసీపీ విశాఖ లా అండ్ ఆర్డర్ కర్నూలు 5 అభిషేక్ మహంతి ఎస్పీ తిరుపతి అర్బన్ కడప 6 విక్రాంతి పాటిల్ ఓఎస్డీ పార్వతీపురం చిత్తూరు 7 అన్బురాజన్ ఓఎస్డీ చిత్తూరు తిరుపతి అర్బన్(ఎస్పీ) 8 రాహుల్ దేవ్ శర్మ ఎస్పీ విశాఖ రూరల్ విశాఖ సిట్ 9 అప్పలనాయుడు ఎస్పీ గుంటూరు రూరల్ విజయవాడ లా అండ్ ఆర్డర్ 10 పీహెచ్డీ రామకృష్ణ ఎస్పీ నెల్లూరు సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ బ్యూరో 11 అద్మాన్ నయీం అస్మీ అడిషనల్ ఎస్పీ కడప విశాఖ లా అండ్ ఆర్డర్ 12 గోపీనాథ్ జెట్టి ఎస్పీ కర్నూలు టీటీడీ సెక్యూరిటీ, విజిలెన్స్ 13 సిద్ధార్థ కౌశల్ ఓఎస్డీ నర్సీపట్నం గుంతకల్ రైల్వే ఎస్పీ 14 రవీంద్ర బాబు - - విశాఖ లా అండ్ ఆర్డర్ -
నేడో రేపో ఐపీఎస్‌ల బదిలీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమై నట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. హైదరాబాద్ నగర కమిషనర్ సహా ఇతర కీలక స్థానాల్లో బదిలీలుంటాయని తెలిపాయి. మహేందర్‌రెడ్డి డీజీపీగా నియమితులవడంతో గత నవంబర్ నుంచి నగర కమిషనర్ బాధ్యతలను అదనపు కమిషనర్ శ్రీనివాస్‌రావు పర్యవేక్షిస్తున్నారు. ఈ స్థానంలో పోలీసు అకాడమీ డైరెక్టర్ జితేందర్‌ను నియమించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అదే పోస్టుకు అదృష్టాన్ని పరీక్షించుకుంటు న్న అంజనీకుమార్‌ను సీఐడీ అదనపు డీజీపీగా, అదనపు కమిషనర్ స్వాతి లక్రాను సైబరాబాద్ కమిషనర్‌గా, హోంశాఖ కార్యదర్శిగా గోపికృష్ణ లేదా గోవింద్‌సింగ్‌ను, పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్యాను నియమించే అవకాశం ఉందని తెలిసింది. జిల్లాల ఎస్పీలనూ పూర్తిస్థాయిలో మార్చనున్నట్లు తెలిసింది. వరంగల్ కమిషనర్ సుధీర్‌బాబును హైదరాబాద్ రేంజ్ డీఐజీగా బదిలీ చేస్తారని, ఆ స్థానంలో రవివర్మ లేదా ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ రవీందర్‌ను నియమిస్తారని సమాచారం. రీజియన్ ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్రలనూ కీలక విభాగాలకు బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ శాంతి భద్రతల అదనపు సీపీగా పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ ఎండీ మల్లారెడ్డిని, హౌజింగ్ ఎండీగా అదనపు డీజీపీ సంతోష్‌మెహ్రాను, డీఎస్ చౌహాన్‌ను వరంగల్ కమిషనర్‌గా, అనిల్‌ను నార్త్‌జోన్ ఐజీగా నియమించనున్నట్లు సమాచారం. శాంతి భద్రతల అదనపు డీజీపీ పోస్టులో ఐజీ ర్యాంకు అధికారిని నియమించనున్నారు. జాబితా కొలిక్కి వచ్చిందని, 49 మంది అధికారులతో కూడిన బదిలీ జాబితా 2 రోజుల్లో వెలువడే అవకాశం ఉందని సమాచారం. -
రాత్రికి రాత్రే యూపీ సీఎం మరో కీలక నిర్ణయం
పట్నా: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం సంచలన నిర్ణయాలతో దూసుకుపోతోంది. తాజాగా యోగి భారీగా ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 41 జిల్లాల పోలీసు బాస్‌లను, ఇతర ఆఫీసర్ల బదిలీలు, పోస్టింగులను చేపట్టారు. ఈ కీలక ఆదేశాలను బుధవారం అర్థరాత్రి జారీ చేశారు. సుమారు 50మందికిపైగా అధికారులకు స్థాన భ్రంశం కల్పించారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాల పోలీస్ బాస్‌లను బదిలీ చేయడం ద్వారా పెద్ద సంస్కరణకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెలరోజుల తరువాత ఇదే అతిపెద్ద పోలీస్ సంస్కరణగా నిలిచింది. ముఖ్యంగా మెయిన్‌పురి, నోయిడా, ఆగ్రా, సహారన్పూర్, అమ్రోహ, గోరఖ్‌పూర్, డియోరియా,కన్నౌజ్ జిల్లాల ఎస్ఎస్పీలను బదిలీ చేసింది. మెయిన్ పురి జిల్లాకు కొత్త పోలీస్ చీఫ్‌గా ఎస్ రాజేష్ నియమితుడయ్యారు. అలాగే బీజేపీ ఎమ్మెల్సీ నేతృత్వంలోని ఊరేగింపు నిషేధించి ఇటీవల వార్లల్లో నిలిచిన షహరన్‌పూర్ ఎస్ఎస్పీ లవ్‌కుమార్‌ను నోయిడాకు ట్రాన్సఫర్ చేయగా, రాయబరేలికి గౌరవ్ సింగ్, లక్నోకు దీపక్‌కుమార్, ఆగ్రాకు దినేష్ చంద్ర దుబే పోలీస్ ఛీప్‌గా వ్యవహరించనున్నారు. మునుపటి సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం నియమించిన ఐపీఎస్ లలో ఎక్కువమందిని రీ షఫిల్ చేయడ విశేషం. -
'పుష్కరాలకు 31,400 మంది పోలీసులతో భద్రత'
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు 31, 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. ఇందులో భాగంగా 30 మంది ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిపారు. విజయవాడలో రూ. 20 కోట్లతో కమాండ్ కంట్రోల్.. 1300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. చెన్నై- కోల్‌కతా- హైదరాబాద్ జాతీయ రహదార్లపై ట్రాఫిక్ పర్యవేక్షణ బాధ్యతలు ఐజీలు రామకృష్ణ, సంజయ్ జైన్‌కు అప్పగించినట్టు తెలిపారు. విజయవాడలో భక్తుల కోసం 65 చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. విజయవాడ, గుంటూరులో 740 ఉచిత బస్సులును ఏర్పాటుచేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. -
తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు, ప్రమోషన్లు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పలువురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి అవినాష్ మొహంతిని సీసీఎస్ డీసీపీగా నియమించారు. ఆయన స్థానంలో ఏఆర్ శ్రీనివాస్ (ఐపీఎస్)ను సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా నియమించారు.నార్త్‌జోన్ డీసీపీగా ఉన్న ఐపీఎస్ అధికారి ఎన్.ప్రకాష్‌రెడ్డిని నల్లగొండ జిల్లా ఎస్పీగా నియమించారు. అలాగే, ఐపీఎస్ అధికారి తరుణ్జోషిని గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా నియమించారు. మెదక్ జిల్లా ఎస్పీగా ఉన్న బి.సుమతి హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా నియమితులయ్యారు. ఆమె స్థానంలో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఎస్పీగా ఉన్న ఎస్.చంద్రశేఖర్‌రెడ్డిని మెదక్ ఎస్పీగా నియమించారు. మహబూబ్‌నగర్ ఎస్పీగా ఉన్న పి.విశ్వప్రసాద్‌ను నిజామాబాద్ ఎస్పీగా నియమించారు. ఓఎస్డీ (క్రైమ్స్)గా ఉన్న ఐపీఎస్ అధికారి బి.నవీన్‌కుమార్‌ను రంగారెడ్డి జిల్లా ఎస్పీగా నియమించింది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి ఏఎస్పీగా ఉన్న సన్‌ప్రీత్‌సింగ్ శంషాబాద్ డీసీపీగా నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నుంచి బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ♦ నల్లగొండ ఎస్పీగా ఎన్ ప్రకాశ్‌రెడ్డి ♦ ఆదిలాబాద్ ఎస్పీగా విక్రమ్‌జిత్ దుగ్గల్ ♦ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌గా తరుణ్ జోషి ♦ నార్త్ జోన్ డీసీపీగా బి.సుమతి ♦ రంగారెడ్డి ఎస్పీగా డి. నవీన్‌కుమార్ ♦ శంషాబాద్ డీసీపీగా సన్‌ప్రీత్ సింగ్ ♦ సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఏఆర్ శ్రీనివాస్ ♦ మెదక్ ఎస్పీగా చంద్రశేఖర్‌రెడ్డి ♦ నిజామాబాద్ ఎస్పీగా విశ్వప్రసాద్ ♦ హైదరాబాద్ రేంజ్ డీఐజీగా అకున్ సబర్వాల్ ♦ హైదరాబాద్ జాయింట్ కమిషనర్(ఎస్బీ)గా ప్రమోద్ కుమార్ ♦ ఇంటెలిజెన్స్ ఐజీలుగా రాజేష్‌కుమార్, శివశంకర్‌రెడ్డి ♦ హైదరాబాద్ అడిషినల్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా సందీప్ శాండిల్య ♦ ఐజీస్పోర్ట్స్‌గా వి.వి. శ్రీనివాసరావు ♦ సీఐడీ ఐజీగా ఆర్బి నాయక్ ♦ అడిషినల్ కమిషనర్ (పరిపాలన)గా పి.మురళీకృష్ణ ♦ అడిషనల్ కమిషనర్ (సాయుధ బలగాలు)గా శివప్రసాద్ ♦ హైదరాబాద్ డీసీపీగా అవినాష్ మహంతి ♦ అదనపు డీజీపీలుగా అంజనీ కుమార్, రాజీవ్‌రతన్‌లకు ప్రమోషన్ -
తెలంగాణాలో భారీగా ఐపీఎస్‌ల బధిలీలు