ISI officers
-
భారత దౌత్యవేత్తకు పాక్ ఐఎస్ఐ బెదిరింపు
లాహోర్: భారత సీనియర్ దౌత్యవేత్తను పాకిస్తాన్ ఐఎస్ఐ(ఇంటర్ సర్వీస్ ఇంటిలిజెన్స్)కు చెందిన ఓ వ్యక్తి వేధించాడు. ఐఎస్ఐ వ్యక్తి, భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లువాలియా నివాసం వెలుపల వేచి ఉండి బయటకు రాగానే అతడి కారును వెంబడిస్తూ.. బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోలో గౌరవ్ అహ్లువాలియా కారును ఓ వ్యక్తి వెంబడించడం చూడవచ్చు. పాకిస్తాన్ ఐఎస్ఐ, గౌరవ్ ఇంటి బయట కార్లు, బైక్‌ల మీద మనుషులను ఉంచి అతడిని వేధింపులకు గురి చేయడమే కాక భయపెట్టేందుకు ప్రయత్నించింది. #WATCH Islamabad: Vehicle of India's Chargé d'affaires Gaurav Ahluwalia was chased by a Pakistan's Inter-Services Intelligence (ISI) member. ISI has stationed multiple persons in cars and bikes outside his residence to harass and intimidate him. pic.twitter.com/TVchxF8Exz — ANI (@ANI) June 4, 2020 న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఐఎస్ఐ అధికారులను భారత్ బహిష్కరించిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులు అబిద్ హుస్సేన్, ముహమ్మద్ తాహిర్‌లు న్యూ ఢిల్లీలోని భారత సైన్యానికి సంబంధించిన పత్రాలను పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భారత గూఢచార సంస్థలు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించారు. -
పాక్ రహస్య గూఢచారి అరెస్టు
న్యూఢిల్లీ : పాకిస్తాన్‌కు చెందిన రహస్య గూఢాచారిగా భావిస్తున్న నిర్మల్ రాయ్ అనే వ్యక్తిని భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. వాస్తవాధీన రేఖ సమీపంలో గల అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో మిలిటరీ ఇంటిలెజిన్స్ అధికారులు అతడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, ఇతరత్రా గాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం... అసోం నివాసి అయిన నిర్మల్ రాయ్ దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. పాకిస్తాన్‌కు చెందిన ఓ ఐఎస్ఐ అధికారితో అతడు తరచుగా మాట్లాడినట్లుగా ఆధారాలున్నట్లు తెలుస్తోంది. ఆర్మీకి సంబంధించిన పలు రహస్య పత్రాలు, ఆర్మీ ఉపయోగించే బ్రిడ్జి వివరాలు, ఆర్మీ ప్రొఫైల్స్, ఆయుధ ప్రొఫైల్స్, కిబితు(అసోం)లోని భారత ఫిరంగిదళం గురించిన సున్నితమైన సమాచారాన్ని దుబాయ్‌లో నివసించే పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్‌తో పాటుగా ఓ ఇండోనేషియన్ మహిళకు కూడా చేరవేసినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ఘాతుకం: బుల్లెట్లతో తూట్లు పొడిచారు
శరీరం నిండా బుల్లెట్లతో జల్లెడగా మారిన దేహం. రంజాన్‌కు కొద్ది గంటల ముందు అపహరణకు గురైన సైనికుడు.. కొన్ని గంటల సస్పెన్స్ తర్వాత మృత దేహంగా కనిపించాడు. కశ్మీర్లో సంచలనం సృష్టించిన జవాన్ ఔరంగజేబ్ అదృశ్యం.. చివరకు విషాదాంతంగా మారింది. శ్రీనగర్: ఫూంచ్‌కు చెందిన ఔరంగజేబ్.. సోఫియాన్‌లోని షాదిమార్గ్ వద్ద ఉన్న రాష్ట్రీయ రైఫిల్స్ 44వ దళంలో జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రంజాన్ పర్వదినం కావటంతో సెలవుపై ఔరంగజేబు గురువారం తన స్వస్థలానికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో అతన్ని అడ్డగించిన కొందరు తమ వెంట తీసుకెళ్లారు. సైనికుడి అపహరణ విషయం తెలిసిన సైన్యం పెద్ద ఎత్తున్న గాలింపు చేపట్టింది. చివరకు శుక్రవారం ఉదయం కలంపోరకు 10 కిలోమీటర్ల దూరంలోని గుస్సూ గ్రామంలో అతని మృత దేహాన్ని ఆర్మీ కనుగొంది. బుల్లెట్లు దింపారు... అతని తల, మెడ భాగంలో మొత్తం బుల్లెట్లతో దింపారు. శరీరం మొత్తం జల్లెడగా మారిపోయింది. ముఖం మొత్తం చిధ్రమైపోయింది’ అని అధికారి ఒకరు. ఇక ఘటనపై కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా సందించారు.‘ఇంతటి భయంకరమైన వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదు. ఔరంగజేబ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. సైన్యం ఆగ్రహం.. ఔరంగజేబ్ మృతి పట్ల భారత సైన్యం రగిలిపోతోంది. రంజాన్ నేపథ్యంలో గత నెలరోజులుగా సరిహద్దులో భారత సైన్యం సంయమనం పాటిస్తూ వస్తోంది. అయితే పాక్ సైన్యం, ఉగ్రవాదులు మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడుతుండటంతో భారత్ అల్టిమేటం ప్రకటించింది. సహనం నశిస్తేనే ఎదరు దాడులు తప్పవని హెచ్చరించింది. గత నెల రోజుల్లో ఇద్దరు ఉగ్రవాద నాయకులను సైన్యం ఎన్కౌంటర్లలో మట్టుబెట్టింది. వారిలో ఏ++ కేటగిరీ ఉగ్రవాది సమీర్ అహ్మద్ భట్ అలియాస్ సమీర్ టైగర్ కూడా ఉన్నాడు. ఔరంగజేబ్ ఆ ఆపరేషన్‌లో పాలుపంచుకోవటం గమనార్హం. ఈ పరిణామాలను జీర్ణించుకోలేని పాక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ ఔరంగజేబును కిరాతకంగా పొట్టనబెట్టుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. మరొకరి మృతి... బందిపొర జిల్లాలో ఈ ఉదయం మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ప్రతిగా సైన్యం చేపట్టిన ఆపరేషన్‌లో ఓ సైనికాధికారి గాయపడ్డారు. అనంతరం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. -
పాక్ పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికేసిన ఐఎస్ఐ అధికారులు
పాకిస్థాన్ అంటేనే సకల అక్రమాలు, అరాచకాలకు నిలయం. ఆ విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. దాదాపు 500 మంది అభ్యర్థులు.. వాళ్లలో 50 మంది ఐఎస్ఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు.. అంతా పాకిస్థాన్‌కు చెందిన నేషనల్ కౌంటర్ టెర్రరిజం అథారిటీ (ఎన్.ఎ.సి.టి.ఎ.) నిర్వహించిన ఓ పరీక్ష రాశారు. అయితే, దాదాపు అందరూ కాపీరాయుళ్లే. పరీక్షలో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోడానికి వాళ్లు తమ మొబైల్ ఫోన్లలో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా ఇన్విజిలేటర్లు పట్టుకున్నారు. ఎన్.ఎ.సి.టి.ఎ.లో ఉన్న 130 ఖాళీలను భర్తీ చేయడానికి ఈ పరీక్ష పెట్టారు. మొత్తం 5 వేల మంది అభ్యర్థులు పరీక్ష రాస్తుండగా, వారి కోసం పది మంది ఇన్విజిలేటర్లున్నారు. పరీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే, వందలాదిమంది అభ్యర్థులు తమ స్మార్ట్ ఫోన్లలో ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తూ దొరికేశారు. అయితే, కేవలం పరీక్ష రాసేవాళ్లే కాదు.. ఇన్విజిలేటర్లు కూడా అక్రమార్కులేనట! ఎందుకంటే, పరీక్ష రాస్తున్న వాళ్లలో కొందరు అభ్యర్థులకు వాళ్లు సాయం చేస్తున్నట్లు ఆరోపణలొచ్చాయి. పరీక్షలలో అక్రమాలు జరిగాయన్న విషయాన్ని ఎన్.ఎ.సి.టి.ఎ. సమన్వయకర్త హైదర్ అలీ అంగీకరించారు. ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఆలస్యంగా అందాయని, తర్వత వాళ్లు ఫోన్లలో ఇంటర్నెట్ చూసి జవాబులు వెతుక్కున్నారని ఆయన చెప్పారు. ఇన్విజిలేటర్లు తమవద్ద ఉన్న మొబైల్ ఫోన్లను ఎత్తుకుపోయే ప్రయత్నాలు చేశారంటూ ఎదురు ఫిర్యాదులు కూడా చేశారట!!