లాహోర్: భారత సీనియర్ దౌత్యవేత్తను పాకిస్తాన్ ఐఎస్‌ఐ(ఇంటర్ సర్వీస్ ఇంటిలిజెన్స్)కు చెందిన ఓ వ్యక్తి వేధించాడు. ఐఎస్ఐ వ్యక్తి, భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లువాలియా నివాసం వెలుపల వేచి ఉండి బయటకు రాగానే అతడి కారును వెంబడిస్తూ.. బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోలో గౌరవ్ అహ్లువాలియా కారును ఓ వ్యక్తి వెంబడించడం చూడవచ్చు. పాకిస్తాన్ ఐఎస్‌ఐ, గౌరవ్ ఇంటి బయట కార్లు, బైక్‌ల మీద మనుషులను ఉంచి అతడిని వేధింపులకు గురి చేయడమే కాక భయపెట్టేందుకు ప్రయత్నించింది.
#WATCH Islamabad: Vehicle of India's Chargé d'affaires Gaurav Ahluwalia was chased by a Pakistan's Inter-Services Intelligence (ISI) member. ISI has stationed multiple persons in cars and bikes outside his residence to harass and intimidate him. pic.twitter.com/TVchxF8Exz
— ANI (@ANI) June 4, 2020
న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఐఎస్‌ఐ అధికారులను భారత్ బహిష్కరించిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ఐఎస్‌ఐ అధికారులు అబిద్ హుస్సేన్, ముహమ్మద్ తాహిర్లు న్యూ ఢిల్లీలోని భారత సైన్యానికి సంబంధించిన పత్రాలను పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భారత గూఢచార సంస్థలు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment