harrase
-
12 ఏళ్లుగా భార్యను గదిలో బంధించిన భర్త.. ఎందుకంటే!
బెంగళూరు: కట్టుకున్న భార్యపట్ల అమానవీయంగా ప్రవర్తించాడో భర్త. అర్థం లేని అనుమానాలతో ఆమెను గృహ నిర్బంధంలో బంధించాడు. కనీసం వాష్‌రూమ్ సదుపాయం లేని ఓ గదిలో ఉంచి తాళం వేశాడు. తన పిల్లలను కూడా కలవనివ్వలేదు. ఒకటి కాదు రెండు దాదాపు గత 12 ఏళ్లుగా భార్యను ఇలాగే వేధిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు శాడిస్టు భర్త. కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ దారుణం చుట్టు పక్కల వాళ్లకు తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ మహిళకు బయటకు తీసుకువచ్చి జరిగిన విషయం గురించి తెలుసుకొని నివ్వెర పోయారు. భర్త ఏ పనిమీద బయటకు వెళ్లినా తనను ఇంట్లో ఉంచి తాళం వేసి వెళ్తాడని బాధితురాలు పోలీసులకు తెలిపింది. పిల్లలతో స్వేచ్ఛగా మాట్లాడనివ్వకుండా, పదే పదే కొట్టేవాడని చెప్పింది. గత 12 ఏళ్లుగా మానసిక క్షోభకు గురి చేశాడని, ఇంట్లోనే బంధించి ఇంటిని జైలుగా మార్చాడని పేర్కొంది. చాలా కాలంగాచి ఈ బాధతో కుంగిపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. తనను బంధించిన గదిలోనే ఒక చిన్న పెట్టెలో కాలకృత్యాలు తీర్చుకొనే దానినని బాధితురాలు వాపోయింది. విషయం తెలిసిన పోలీసులు ఆమె భర్తను అదుపులోకి తీసుకుని ఈ విషయమై కౌన్సెలింగ్ ఇచ్చారు. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరించింది. ఇకపై అతడికి విడాకులు ఇచ్చి పుట్టింట్లో ఉంటానని తెలిపింది. కాగా అతడికి బాధితురాలు మూడో భార్య మొదట రెండు పెళ్లిళ్లు అయ్యాయి. కానీ అతడి వేధింపులకు తాళలేక వారిద్దరూ వదిలేసి వెళ్లిపోయారు. వీరికి ఇద్దరు పిల్లల -
మైనర్ బాలికపై వేధింపులు.. ఒక గంట వ్యవధిలోనే..
సాక్షి, విజయనగరం క్రైమ్: ఆపద సమయాన దిశ యాప్‌ను ఆశ్రయించిన బాలికను పోలీసులు రక్షించారు. పోలీస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెంటాడ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మైనరు బాలిక ఆపదలో ఉన్నట్టుగా మంగళవారం దిశ మొబైల్ యాప్‌లోని ఎస్ఎఎస్ బటన్ని ప్రెస్ చేసింది. సమాచారం విజయవాడలోని దిశ కంట్రోల్ రూమ్‌కి అందింది. దిశ కంట్రోల్ రూమ్ సిబ్బంది వెంటనే స్పందించి విజయనగరం దిశ డీఎస్పీ టి.త్రినాథ్‌కు సమాచారం అందించారు. వివరాలను ఎస్పీ బి.రాజకుమారికి తెలిపి ఆమె ఆదేశాలతో బాలికను రక్షించేందుకు ఆండ్ర ఎస్సైకి సమాచారమందించారు. ప్రత్యేక పోలీసు బృందం వెంటనే బాలిక ఉంటున్న లొకేషన్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుంది. బాలికను వేధింపులకు గురిచేసిన ఆకతాయిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదుచేసింది. ఈ సందర్భంగా ఎస్పీ బి.రాజకుమారి మాట్లాడుతూ మహిళల భద్రతకు దిశ యాప్ భరోసా కల్పిస్తోందన్నారు. ప్రతి మహిళా తమ మొబైల్స్‌లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. బాలిక ధైర్యం చేసి, దిశ ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేయడంతో సకాలంలో సంఘటనా స్థ్ధలానికి చేరి, రక్షించగలిగామన్నారు. -
భారత దౌత్యవేత్తకు పాక్ ఐఎస్ఐ బెదిరింపు
లాహోర్: భారత సీనియర్ దౌత్యవేత్తను పాకిస్తాన్ ఐఎస్ఐ(ఇంటర్ సర్వీస్ ఇంటిలిజెన్స్)కు చెందిన ఓ వ్యక్తి వేధించాడు. ఐఎస్ఐ వ్యక్తి, భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లువాలియా నివాసం వెలుపల వేచి ఉండి బయటకు రాగానే అతడి కారును వెంబడిస్తూ.. బెదిరించే ప్రయత్నం చేశాడు. ఈ వీడియోలో గౌరవ్ అహ్లువాలియా కారును ఓ వ్యక్తి వెంబడించడం చూడవచ్చు. పాకిస్తాన్ ఐఎస్ఐ, గౌరవ్ ఇంటి బయట కార్లు, బైక్‌ల మీద మనుషులను ఉంచి అతడిని వేధింపులకు గురి చేయడమే కాక భయపెట్టేందుకు ప్రయత్నించింది. #WATCH Islamabad: Vehicle of India's Chargé d'affaires Gaurav Ahluwalia was chased by a Pakistan's Inter-Services Intelligence (ISI) member. ISI has stationed multiple persons in cars and bikes outside his residence to harass and intimidate him. pic.twitter.com/TVchxF8Exz — ANI (@ANI) June 4, 2020 న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఇద్దరు ఐఎస్ఐ అధికారులను భారత్ బహిష్కరించిన కొద్ది రోజులకే ఈ సంఘటన జరగడం గమనార్హం. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ఐఎస్ఐ అధికారులు అబిద్ హుస్సేన్, ముహమ్మద్ తాహిర్‌లు న్యూ ఢిల్లీలోని భారత సైన్యానికి సంబంధించిన పత్రాలను పొందడానికి ప్రయత్నిస్తున్నప్పుడు భారత గూఢచార సంస్థలు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించారు. -
ప్రతీకారంతో ‘ఫేస్‌బుక్క’య్యారు!
మాజీ ఉద్యోగినికి ఫేస్బుక్ ద్వారా వేధింపులు బీపీఓ కంపెనీ నిర్వాహకుడికి అరదండాలు ఫొటోలకు ఫోజులిచ్చిన 14 మందీ నిందితులే నలుగురిని మంగళవారం అరెస్టు చేసిన వైనం సాక్షి, సిటీబ్యూరో: తన దగ్గర ఉద్యోగం చేసి మానేసిన యువతి తనపైనే ఆన్లైన్లో సెటైర్స్ వేస్తోందని పగబట్టిన ఓ వ్యక్తి.. ప్రతీకారంగా ఫేస్బుక్ ద్వారానే ఆమెపై విరుచుకుపడ్డాడు... ఆ యువతికి సంబంధించి అసభ్యకరమైన వ్యాఖ్యల్ని ఫొటోలు తీసి పోస్ట్ చేశాడు... సీన్ కట్ చేస్తే సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకెళ్లాడు. ఇతడి ఆదేశాల మేరకు ‘ఫొటో’లకు ఫోజులిచ్చిన 14 మంది ఉద్యోగులూ నిందితుల జాబితాలోకి చేరారు. వీరిలో నలుగురు మంగళవారం అరెస్టు కాగా... మిగిలిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతంలో సయ్యద్ అబ్దుల్ ఖదీర్ బీపీఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు. ఇందులో రెండు నెలల పాటు పని చేసిన యువతిని కొన్నాళ్ల క్రితం అనివార్య కారణాలతో ఉద్యోగం నుంచి తొలగించాడు. అయితే, ఆ యువతికి చెల్లించాల్సిన జీతభత్యాలను చెల్లించకపోవడంతో అసలు కథ మొదలైంది. సరదాల పోస్టింగ్స్‌పై సెటైర్... బీపీఓ సంస్థ ఎండీ ఖదీర్‌తో పాటు బాధితురాలైన యువతికీ ఫేస్బుక్ పేజ్లున్నాయి. వాటి లో వీరిద్దరితో పాటు సంస్థలో పని చేసే ఇతర ఉద్యోగులూ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఖరీద్ కార్లతో తిరుగుతూ స్నేహితులతో సరదాగా గడిపిన ఫొటోలను తన ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేశాడు. వీటిని చూసిన మాజీ ఉద్యోగిని తీవ్రంగా స్పం దించింది. తనకు ఇవ్వాల్సిన జీతం డబ్బుతో జల్సాలు చేస్తున్నాడని కామెంట్ పెట్టింది. పలు సందర్భాల్లో ఇలానే ఆ యువతి కామెంట్స్ పోస్టు చేయడంతో ఖదీర్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆమెపై ఆన్లైన్లోనే ప్రతీకారం తీర్చుకోవాలని ఫేస్బుక్ ద్వారానే కౌంటర్ ఎటాక్ కు దిగాడు. ఇందులో తన కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగుల్నీ పాత్రధారుల్ని చేశాడు. ఫొటోలకు ‘ఫోజులిచ్చి’ నిందితులుగా... సదరు యువతి పేరు వినియోగించిన పరుష పదజాలం, అసభ్యకర వ్యాఖ్యలతో ప్రింట్ఔట్లు తీయించాడు. వీటిని తన ఉద్యోగుల ద్వారా డిస్ప్లే చేయిస్తూ ఫొటోలు తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన బాధితురాలు ఆగస్టు 8న సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ పి.రాజు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలను సేకరించి ప్రధాన నిందితుడిగా ఉన్న బీపీఓ కంపెనీ ఎండీతో ఖదీర్‌తో పాటు అతడికి సహకరించిన అమిత్ లాల్వానీని గతనెల్లో అరెస్టు చేశారు. అసభ్యకర వ్యాఖ్యలతో కూడిన ప్రింట్ ఔట్లతో ఫొటోలకు ఫోజులిచ్చిన సంస్థ ఉద్యోగులు 14 మందినీ పోలీసులు ఈ కేసులో నిందితులుగా చేర్చారు. వీరిలో ఎకేంద్ర బిస్తా, కేవియన్ రోస్, మహ్మద్ అర్బాజ్, సాల్మన్ ఫెన్సికోలను మంగళవారం అరెస్టు చేశారు. మిగిలిన వారి పైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. -
విద్యార్థినిపై లెక్చరర్ కీచక పర్వం
కర్నూలు: జిల్లా బనగానపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఓ లెక్చరర్ కీచకపర్వానికి తెరతీశాడు. తండ్రి వయస్సున్న లెక్చరర్ ఓ ఇంటర్ విద్యార్థినిని లైంగికంగా వేధిస్తూ పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడ్డాడు. ఆ విద్యార్థిని ఎన్నిసార్లు తిరస్కరించినా అతడి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆ లెక్చరర్‌కు దేహ శుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. సదరు లెక్చరర్‌పై ఇదివరకు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. విద్యార్థినులతో ఆయన వ్వవహర శైలిపై కూడా ఫిర్యాదులు వచ్చాయి. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.