Islamic Calendar
-
ప్రవక్త జీవితంలో ముఖ్య ఘట్టం.. మొహర్రం
ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం సంవత్సరంలోని మొదటి నెల ‘మొహర్రం ’. ప్రతి సంవత్సరం ఈ నెల వస్తూనే ముహమ్మద్ ప్రవక్త (స) వారి జీవితంలోని ఓ ముఖ్యమైన ఘట్టం మనసులో మెదులుతుంది. అదే ‘హిజ్రత్’. (మక్కా నుండి మదీనాకు వలస). హిజ్రత్ తరువాతనే ధర్మానికి జవసత్వాలు చేకూరాయి, ధర్మం ఎల్లెడలా విస్తరించింది. ధర్మ పరిరక్షణ, మానవ సేవ, మానవులకు సత్య సందేశాన్ని అందించడం లాంటి మహత్తర ఆశయం కోసం కష్ట నష్టాలను సహించాల్సి వచ్చినా, చివరికి స్వదేశాన్ని విడిచి వలస వెళ్ళవలసి వచ్చినా వెనకాడకూడదనే విషయాన్ని ముహర్రం ప్రతి సంవత్సరం విశ్వాసులకు గుర్తు చేస్తూ ఉంటుంది.దేవుడు భూమ్యాకాశాలను సృష్టించిన నాటినుండి నెలల సంఖ్య పన్నెండు మాత్రమే. వాటిలో నాలుగు పవిత్ర మాసాలు’. అందులో ‘మొహర్రం’ కూడా ఒకటి. ప్రవక్త(స) ప్రవచనం ప్రకారం: ‘పన్నెండు నెలలు ఒక సంవత్సరం. అందులో నాలుగు నెలలు గౌరవప్రదమైనవి. జుల్ ఖ అద, జుల్ హిజ్జ, ముహర్రమ్, రజబ్. కనుక ఈ నెలలో ఎక్కువగా సత్కార్యాలు ఆచరిస్తూ పాపాలకు దూరంగా ఉండాలి. సమాజంలో సత్యం, న్యాయం, ధర్మం, మానవీయ విలువల పరిరక్షణకు కృషి చేయాలి. సమాజంలో ప్రబలిన అన్ని రకాల చెడులను రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. సతతం దైవ భీతి (తఖ్వా) తో గడపాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. ఈ నెల ఘనతకు సంబంధించి ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా అన్నారు. ‘ముహర్రం అల్లాహ్ నెల. రమజాన్ ఉపవాసాల తరువాత శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలే.’ (సహీహ్ ముస్లిం: 2755) రమజాను ఉపవాసాలు ఫర్జ్ కాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండేది. అదే రోజు కాబాపై కొత్తవస్త్రం కప్పేవారు. ప్రవక్త మహనీయులు మదీనాకు వలస వెళ్ళిన తరువాత, అక్కడి యూదులు రోజా (ఉపవాసం) పాటించడం గమనించారు. అది ముహర్రం పదవ తేదీ. (యౌమె ఆషూరా) అప్పుడు ప్రవక్త వారు, ‘ఏమిటి ఈరోజు విశేషం?’ అని వారిని అడిగారు. దానికి వారు, ‘ఇది చాలా గొప్పరోజు. ఈ రోజే దైవం మూసా ప్రవక్త(అ) ను, ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. అప్పుడు మూసా ప్రవక్త, దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజు ఉపవాసం పాటిస్తాము’. అని చె΄్పారు. అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం’ అని చెప్పి, తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు. ముహర్రం మాసం 9, 10 లేదా 10, 11 కాని రెండురోజులు రోజా (ఉపవాసం) పాటించాలి. ఆషూరా ఉపవాసం పాటించడం వల్ల గత సంవత్సరకాలం పాపాలు మన్నించబడతాయని కూడా ఆయన సెలవిచ్చారు. (సహీహ్ ముస్లిం 1162).మొహర్రం నెల ్రపాముఖ్యం, హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరత్వం మామూలు విషయం కాదు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపన, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో హజ్రత్ ఇమామె హుసైన్, ఆయన పరివారం వీరమరణం పొందారు. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం ్రపాణాలను సైతం లెక్క చేయకుండా ΄ోరాడి అమరుడయ్యారో మనం దాని నుంచి ప్రేరణ పొందాలి. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, సమాజ శ్రేయోభిలాషులు, న్యాయప్రేమికులు, ΄ûరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయం కోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం శక్తివంచన లేకుండా ΄ోరాడాలి. ఇదే ఇమామె హుసైన్ అమరత్వం మనకిస్తున్న సందేశం.( 17, బుధవారం మొహర్రం – యౌమె ఆషూరా)కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ్రపాముఖ్యత మరింతగా పెరిగి΄ోయింది. అంతమాత్రాన ముహర్రం నెలంతా విషాద దినాలుగా పరిగణించనక్కర లేదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మం కోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. అమరత్వం అనేది మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమోగాని, విషాదం ఎంతమాత్రం కాదు. ‘కర్బలా’ సాక్షిగా ఒక విశ్వాసి ΄ోషించవలసిన పాత్రను ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ నెలలో ఆయన త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్మరించుకుంటారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ముందుగానే రంజాన్ ఎందుకిలా.?
సాక్షి సిటీబ్యూరో: ఈసారి రంజాన్ మాసం ముందొచ్చినట్టు అనిపిస్తుంది కదూ! అవును దీనికి ఓ కారణముంది. ఇంగ్లిష్ క్యాలెండర్‌తో పోలిస్తే... ఇస్లామిక్ క్యాలెండర్లో రోజుల సంఖ్య తక్కువ. అందుకే రంజాన్ ముందుగానే మొదలవుతుంది. గతేడాది రంజాన్ మే 27న ప్రారంభమైంది. ఈసారి ఈ నెల 16న నెలవంక దర్శనమిస్తే... 17న రంజాన్ మొదలవుతుంది. అంటే 12 రోజులు ముందుగానే రంజాన్ ప్రారంభమవుతుందన్న మాట. ఒక్క రంజాన్ మాసమే కాదు... ఇస్లామిక్ క్యాలెండర్లో అన్ని మాసాలు ముందుగానే వస్తాయి. ఎందుకిలా అంటారా? అయితే చరిత్ర తెలుసుకోవాల్సిందే. మహ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనా నగరానికి వలస (హిజ్రత్) వెళ్తారు. ఇది ఇస్లామిక్ చరిత్రలో ఓ ఘట్టం. మదీనాకు చేరుకున్న నాటి నుంచే హిజ్రీ క్యాలెండర్ ప్రారంభమైంది. ప్రస్తుతం హిజ్రీ 1439వ సంవత్సరం నడుస్తోంది. ఆంగ్ల సంవత్సరాదిలో ఉన్నట్టే... హిజ్రీ క్యాలెండర్‌లోనూ 12 నెలలు ఉంటాయి. మొదటి నెల మొహరంతో మొదలై వరుసగా సఫర్, రబ్బీల్ఆవ్వల్, రబీవుల్సానీ, జమాదుల్ఆవ్వల్, జమాదుస్సానీ, రజ్జబ్, షాబాన్, రంజాన్, షవ్వాల్, జీఖద్, జిలహజ్ ఉంటాయి. ఇందులో రంజాన్ తొమ్మిదో నెల. ప్రతి నెలలో తక్కువే... ఇంగ్లిష్ క్యాలెండర్లో ఒక్క ఫిబ్రవరిని మినహాయిస్తే మిగతా నెలల్లో కొన్నింటిలో 30 రోజులు, మరికొన్నింటిలో 31 రోజులు ఉంటాయి. కానీ ఇస్లామిక్ క్యాలెండర్లో అలా ఉండదు. కొన్ని నెలల్లో 29 రోజులు , మరికొన్నింటిలో 30 రోజులు ఉంటాయి. ఏ నెలలోనూ 31 రోజులు ఉండవు. అంటే ఇంగ్లిష్ క్యాలెండర్‌తో పోలిస్తే ఇస్లామిక్ క్యాలెండర్లో ఏడాదికి 10–12 రోజులు తగ్గిపోతాయి. అందుకే రంజాన్ మాసం 12రోజులు ముందుగానే వస్తోంది. నెలవంక ఆధారంగా... ఆంగ్ల సంవత్సరాది ప్రకారం అర్ధరాత్రి 12గంటలు దాటిన తర్వాత మరుసటి రోజు ప్రారంభమవుతుంది. కానీ ఇస్లామిక్‌లో అలా కాదు. సూర్యాస్తమయంతో మరుసటి రోజు మొదలవుతుంది. నెలలు కూడా అంతే... నెలవంక చూసిన తర్వాత మరుసటి నెల మొదలవుతుంది. అంటే సాయంత్రం వేళ నెలవంక దర్శమిచ్చిన మరుక్షణం నుంచే ఇస్లామిక్ నెల ప్రారంభమవుతుంది. సాయంత్రం వేళ నెలవంక దర్శనమిచ్చాకే రంజాన్ మాసం ప్రారంభమైందంటూ మసీదుల్లో సైరన్ మోగిస్తారు. -
దేవునికి దగ్గరగా...
రంజాన్ స్పెషల్ మూడు భాగాలుగా(పదేసి రోజులుగా) విభజించిన పవిత్ర రంజాన్ మాసంలోని చివరి అంకం పూర్తి కావస్తోంది. చేసిన పాపాల నుంచి విముక్తి కోరేందుకు చివరి దీక్ష రోజులు ప్రత్యేకంగా కేటాయించారని ముస్లింలు చెబుతారు.అంతరార్థంలో పాపాలు చేయొద్దనే సూక్తి ఉందని అంటారు. తల్లిని ప్రేమించడం, మనిషిని మనిషిలాగానే చూడడం, మద్యపానానికి దూరంగా ఉండడం, విచ్చల విడితనం మంచిది కాదని తెలుసుకోవడం ఈ దశకం ప్రత్యేకతలని అంటారు. - విశాఖపట్నం ఇస్లామిక్ క్యాలెండర్‌లోని 12 నెలల్లో రంజాన్ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది 29 లేక 30 రోజులుంటాయి. మనిషిలో ప్రాపంచిక కోర్కెలు, ఈర్ష్య, అసూయలను దహించేదిగా రంజాన్‌ను అభివర్ణించినట్టు హదీస్లో పేర్కొనబడిందని మతపెద్దలు చెబుతారు. పవిత్ర మాసాన్ని దీన్నే మూడు భాగాలుగా విభజించారు. మొదటి పది రోజులను ‘రెహమత్కా అష్ర’ అంటారు. ఇందులో అల్లా కరుణ, దయ ఉంటుందని, రెండో దశలో ‘మగ్ఫిరత్కా అష్ర’, చేసిన పాపాలకు క్షమాపణను కోరడం, మూడో దశలో ‘జహన్నం సే ఫనా మాంగ్నే కా అష్ర’ నరకం నుంచి విముక్తి కోసమని ఉపవాస దీక్షలో అల్లాను మనస్ఫూర్తితో ప్రార్థించాలని మతపెద్దలు చెబుతారు. స్వచ్ఛమైన మనసు ఉంటేనే... మద్యం సేవంచేవారు , తల్లిదండ్రులపై ప్రేమ, కరుణ చూపనివారు, బం దుత్వాలను తెగదెంపులు చేసేవాళ్లు, ఈర్ష్యాద్వేషా లు కలిగిన వారు, విచ్చలవిడిగా శృంగారాల్లో పాల్గొనే వ్యక్తుల పాపాలను అల్లా క్షమించడని, అయితే రంజాన్ మాసం లో ఉపవాస దీక్షలో స్వ చ్ఛమైన మనసుతో మ రోసారి తప్పులు చేయనని వేడుకుంటే అల్లాహ్ విముక్తి కల్పిస్తారని పవిత్ర గ్రంథం ఖురాన్ బోధిస్తోందంటున్నారు. రంజాన్ నెలలో ఆఖరి శుక్రవారం ‘జమా- తుల్-విదా’ సందర్భంగా మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. దానకార్యాలకు ప్రాధాన్యం.. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ప్రారంభించి నెలవంకను చూసి దీక్షలు ముగిస్తారు. ఉపవాస దీక్ష చేపట్టిన ప్రతి వ్యక్తి ఉదయం నుంచి రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తారు.సాధారణ రోజుల కంటే రంజాన్‌లో చేసిన దానానికి 70 రెట్లు పుణ్యం చేకూరుతుందని పవిత్ర గ్రంథం ఖురాన్ బోధిస్తుంది. పేదలు కూడా పండగ చేసుకోవాలనే సదుద్దేశంతో ఫిత్రా, జకాత్ వంటి దానాలు చేస్తారు. ‘జకాత్’లో భాగంగా సంపాదించిన సొమ్ములో రెండున్నర శాతాన్ని దానం చేయాలని, ‘ఫిత్రా’లో భాగంగా రెండు కిలోల 45 గ్రాముల గోధుములు గాని, లేక తదనుగుణంగా మార్కెట్ ధరను పేదలకు అందజేయాలని మతపెద్దలు చెబుతారు. నిరుపేదలకు దుస్తులు, సరుకులు, ఆహార రూపంలో అందిస్తారు. ‘ఫిత్రా’ అనేది ప్రతి ముస్లింకు తప్పనిసరి. రంజాన్ పండగ లోపు పేదలకు అందజేయాలి. ‘ఫిత్రా’ ప్రాముఖ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ పండగను ఈద్-ఉల్-ఫితర్‌గా పేర్కొనడం జరిగింది. ఇతేకాఫ్ ప్రపంచంతోపాటు సమాజ సుఖాలను త్యజించి రం జాన్ నెలలో ఆఖరి పది రోజులపాటు పూర్తిగా అల్లా కోసం గడిపే కార్యక్రమాన్ని ఇతేకాఫ్ అంటారు. మసీదులో మూలన గుడారం ఏ ర్పాటు చేసుకొని అక్కడే ఉండాలి.ఖురాన్ ప ఠనం, అల్లాహ్ ధ్యానం లో గడపాలి. దీంతో చాలా పుణ్యం చేకూరుతుందని పవిత్ర గ్రంథంలో ఖురాన్లో పేర్కొన్నట్టు మతపెద్దలు చెబుతారు. లైల-తుల్-ఖద్ర్ ప్రత్యేకత.. రంజాన్ నెలలో 26వ రాత్రిని లైల-తుల్-ఖద్ర్(పెద్దరాత్రి) జరుపుకుంటారు. రాత్రంగా జాగరణ చేసి అల్లాను ఆరాధించి నమాజులు చేసి, ఖురాన్ పఠించి, దువా చేసి అనుగ్రహం పొందితే మరణం తర్వాత స్వర్గం లభిస్తుందని ఖురాన్ బోధిస్తోంది. వెయ్యి నెలల పాటు నిత్యం అల్లాహ్‌ను ఆరాధిస్తే లభించే పుణ్యం కేవలం లైల-తుల్-ఖద్ర్ రాత్రిన ఆరాధనలతో లభిస్తుందని, ఇదే రోజున పవిత్ర గ్రంథం ఖురాన్ అవతరించిందని మతపెద్దలు చెబుతారు. లైల-తుల్-ఖద్ర్ రాత్రి నాడు తరావీ నమాజ్‌లో ఖురాన్ ఆఖరి ఆధ్యాయ పఠన పూర్తవుతుంది. రాత్రంగా జాగరణ చేసి ప్రత్యేక ప్రార్థనలు, నమాజ్‌లు చేస్తారు. నగరంలోని అన్ని మసీదుల్లో లైల-తుల్-ఖద్ర్ వేడుకలు జరుపుతారు. ఈ సందర్భంగా అన్ని మసీదుల్లో సహరీ ఏర్పాట్లు చేస్తున్నారు. మసీదులన్నీ విద్యుత్‌దీపాలతో అలంకరించారు. శాంతి, సహనానికి ప్రతీక రంజాన్ దేవునిపై నమ్మకం, తమను తాము ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంచుకుని, నెల రోజులు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి తరువాత చేసుకునే పండగ ఈద్-ఉల్-ఫిత్’(రంజాన్). శాంతి, సహనానికి ప్రతీకగా ఈ పండగ నిలుస్తోంది. నెలవంక చూసిన తర్వాతనే పండగ జరుపుకోవాలని మహమ్మద్ ప్రవక్త హదీస్లో పేర్కొన్నారు. రంజాన్ పండగ ప్రత్యేక నమాజ్‌కు వచ్చే ముందుగానే ‘ఫిత్రా’, ‘జకాత్’ దానాలు పేదలకు అందజేయాలి. - మౌలానా మౌల్వీ పాజిల్ సయ్యద్ షాహుల్ హమీద్,ఇమామ్ వ ఖతీబ్, యాసీన్ మసీద్, న్యూరేసపువానిపాలెం, విశాఖపట్నం