issue price
-
Sovereign Gold : 22 నుంచి ఐదు రోజులు కొత్త గోల్డ్ బాండ్ స్కీమ్
ముంబై: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2022–23 రెండవ సిరీస్ సోమవారం ప్రారంభమవుతోంది. ఐదు రోజుల పాటు (ఆగస్టు 22 నుంచి 26 వరకూ) చందాదారులకు అందుబాటులో ఉండే ఈ స్కీమ్ బాండ్ ఇష్యూ ధర గ్రా ముకు రూ.5,197 అని శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆర్బీఐ తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే, రూ.50 డిస్కౌంట్‌తో రూ.5,147కే బాండ్ లభిస్తుందని ప్రకటన పేర్కొంది. కేంద్రం తరఫుల ఆర్బీఐ చేసే ఈ బాండ్లు స్టాక్ ఎక్సే్చంజీలతోపాటు నిర్దిష్ట బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా లభ్యమవుతాయి. దేశంలో భౌతిక పసిడికి డిమాండ్ తగ్గించి, ఇందుకు సంబంధించిన డబ్బును పొదుపు పథకాల్లోకి మళ్లించడానికి 2015 నవంబర్‌లో కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. -
నేటి నుండి పసిడి బాండ్ల విక్రయం
న్యూఢిల్లీ: తదుపరి విడత సావరీన్ గోల్డ్ బాండ్ల (ఎస్జీబీ) విక్రయం సోమవారం ప్రారంభమై అయిదు రోజుల పాటు కొనసాగనుంది. ఇష్యూ ధరను గ్రాము బంగారానికి రూ. 5,091గా నిర్ణయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గోల్డ్ బాండ్ల విక్రయం చేపట్టడం ఇదే తొలిసారి. ఆన్లైన్ మాధ్యమం ద్వారా దరఖాస్తు చేసుకుని, డిజిటల్ విధానంలో చెల్లిస్తే గ్రాముకు రూ. 50 చొప్పున డిస్కౌంటు లభిస్తుంది. రిజర్వ్ బ్యాంక్ గణాంకాల ప్రకారం 2015 నవంబర్‌లో ప్రారంభమైనప్పట్నుంచీ ఈ స్కీము ద్వారా ప్రభుత్వం రూ. 38,693 కోట్లు (సుమారు 90 టన్నుల బంగారం విలువ) సమీకరించింది. కోవిడ్ వ్యాప్తి సమయంలో (2020–21, 2021–22) ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు ఎక్కువగా మొగ్గు చూపారు. ఏకంగా రూ. 29,040 కోట్ల మేర బాండ్లను కొనుగోలు చేశారు. ఈ స్కీము ద్వారా ఇప్పటిదాకా ప్రభుత్వం సమీకరించిన నిధుల్లో ఇది దాదాపు 75 శాతానికి సమానం కావడం గమనార్హం. -
లిస్టింగ్‌లో అదరగొట్టిన బంధన్ బ్యాంక్
సాక్షి,ముంబై: కోలకతాకు చెందిన ప్రయివేట్ రంగ సంస్థ బంధన్ బ్యాంక్ లిస్టింగ్‌లో అదరగొట్టింది. డెబ్యూ లిస్టింగ్‌లో 33శాతం ప్రీమియం లాభాలతో లిస్ట్ అయింది. అయ్యింది. ఇష్యూ ధర రూ. 375 కాగా.. బీఎస్ఈలో 499 వద్ద గరిష్టాన్ని తాకింది. మార్చి 19న ముగిసిన ఇష్యూ బ్యాంక్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లాభాలతో లిస్టయ్యింది. గత వారం దాదాపు 15 రెట్లు అధికంగా సబ్స్క్యయిబ్ అయింది. రూ. 375 ధరలో చేపట్టిన ఐపీవో ద్వారా బ్యాంకు రూ. 4,473 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా బ్యాంకు 8.35 కోట్ల షేర్లను అమ్మకానికి ఉంచగా.. దాదాపు 122 కోట్ల షేర్ల కోసం బిడ్స్ దాఖలైన సంగతి తెలిసిందే. ఇష్యూ ముందు రోజు యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి బంధన్ బ్యాంకు రూ. 1342 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 375 ధరలో 65 యాంకర్ సంస్థలకు దాదాపు 3.58 కోట్ల షేర్లను విక్రయించింది. కాగా బంధన్ బ్యాంకు ప్రధానంగా పశ్చిమ బెంగాల్, అసోం, బీహార్ తదితర తూర్పు, ఈశాన్య రాష్టాలలో కార్యకాలాపాలు విస్తరించింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి మొత్తం 887 బ్రాంచీలలో 58 శాతం శాఖలను ఈ ప్రాంతాలలోనే ఏర్పాటు చేసింది. మొత్తం430 ఏటీఎంలను ఏర్పాటు చేసింది. మైక్రో ఫైనాన్సింగ్ బిజినెస్‌లో పట్టుసాధించిన సంస్థ తదుపరి సాధారణ బ్యాంకింగ్ సర్వీసులు అందించేందుకు లైసెన్సింగ్‌ను పొందింది. దాదాపు 2.13 మిలియన్లకుపైగా ఖాతాదారులను కలిగి ఉంది. -
చరిత్ర సృష్టించిన బీఎస్ఈ
న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత పురాతన ఎక్స్చేంజ్, దేశంలోనే రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ శుక్రవారం చరిత్ర సృష్టించింది. తన ప్రత్యర్థి ఎన్ఎస్ఈలో బ్లాక్‌బస్టర్ హిట్‌తో లిస్టు అయింది. ఇష్యూ ధర రూ.806కు 34.62 శాతం ప్రీమియంతో షేర్లు రూ.1,085కు జంప్ అయ్యాయి. భారత్‌లో లిస్టవుతున్న మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఇదే. 5-15 శాతం ప్రీమియంతో బీఎస్ఈ స్టాక్ లిస్టవుతుందని విశ్లేషకులు అంచనావేశారు. జనవరి 23న మొట్టమొదటిసారి ఐపీఓకు వచ్చిన బీఎస్ఈకి మూడు రోజుల బిడ్డింగ్‌లో ఆఖరి రోజు బంపర్ డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. 51 రెట్ల సబ్‌స్క్రిప్షన్‌తో అదరగొట్టేసింది. అదేమాదిరి ఇప్పుడు కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌తో మార్కెట్లో లిస్టు అయింది. అన్ని సెగ్మెంట్లో బీఎస్ఈకి 1,440 యునిక్ మెంబర్లున్నారు. ఆసియాలో పురాతనమైన ఎక్స్చేంజ్ అయిన బీఎస్ఈ 1875 జూలై 9న ఏర్పాటైంది. 2016 జూలై 30కు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్చేంజ్ల్లో ఒకటిగా నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఇది ప్రపంచంలో 11వ అతిపెద్ద ఎక్స్చేంజ్. లిస్టెడ్ కంపెనీలతో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.52 ట్రిలియన్ డాలర్లు. -
కాఫీ డే ఐపీఓ ఇష్యూ ధర రూ.328
- రూ.1,150 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: కాఫీ డే ఎంటర్ప్రైజెస్ తన ఐపీఓ ఇష్యూధరను రూ.328గా నిర్ణయించింది. గత శుక్రవారం(అక్టోబర్ 16న) ముగిసిన ఈ ఐపీఓకు ప్రైస్‌బాండ్‌గా రూ.316-328ని కాఫీ డే ఎంటర్ప్రైజెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ ఐపీఓ ద్వారా 3.5 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేశామని, రూ. 328 ఇష్యూధరను పరిగణనలోకి తీసుకుంటే రూ.1,150 కోట్ల నిధులు వస్తాయని తెలిపింది. ఈ ఇష్యూ 1.8 రెట్లు సబ్‌స్క్రైబ్ అయిందని, రూ.2,000 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయని పేర్కొంది. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లతో చర్చించి ఇష్యూ ధరను రూ.328గా నిర్ణయించామని వివరించింది. రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా పూర్తిగా సబ్‌స్క్రైబ్ కానప్పటికీ, ప్రైస్‌బాండ్ గరిష్ట ధరను ఇష్యూధరగా కంపెనీ నిర్ణయించింది. 2012 డిసెంబర్లో వచ్చిన రూ.4,000 కోట్ల భారతీ ఇన్ఫ్రాటెల్ ఐపీఓ తర్వాత ఇదే అతి పెద్ద ఐపీఓ.