IT wing
-
లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరిట టీడీపీ ఐటీ వింగ్ హంగామా
సాక్షి, హైదరాబాద్: స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్‌పై హంగామా సృష్టించేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్ పేరిట టీడీపీ ఐటీ వింగ్ పేరుతో కొందనే మెట్రో రైలులో హడావుడి చేసేందుకు ప్రయత్నించారు. కానీ.. వారికి మెట్రో ప్రయాణీకులే షాకిచ్చారు. సీబీఎన్‌కు అనుకూలంగా నినాదాలు చేస్తున్న వారిని అడ్డుకున్న ఓ మధ్య వయస్కుడు మాట్లాడుతూ... ‘ఎక్కడ చేయాలో అక్కడ చేయండి. ఏం చేయాలో అది చేయండి. అంతేకానీ ఊరికే అరచి ఏం ఉపయోగం’’ అని ప్రశ్నించడంతో వారు ఖంగు తిన్నారు. అయితే టీడీపీ వర్గం వారు అక్కడితో ఆగిపోలేదు.. ‘‘ఏం చేయమంటారు’’ అని ఎదురు ప్రశ్నించారు. దీనికి కూడా అతడు ఓపికగా బదులిచ్చాడు. ‘‘న్యాయపోరాటం ఒకటి నడుస్తోంది కదా...’’ అని సమాధానమిచ్చారు. టీడీపీ ఐటీ వింగ్ పేరుతో కొంతమంది మియాపూర్నుం నుంచి ఎల్బీనగర్ వరకు మెట్రోరైలులో ప్రయాణిఒంచారు. దారిపొడవునా నినాదాలు చేస్తూ ప్రజల దృష్టిని ఆకర్శించాలన్నది వారి ఉద్దేశం. మియాపూర్‌లో మెట్రోరైలు ఎక్కే సమయంలోనూ టీడీపీ కార్యకర్తలు పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అందరినీ ఒకేసారి వదలడం లేదంటూ పేచీ పెట్టారు. అయితే టీడీపీ కార్యకర్తలను మాత్రమే లోనికి వదిలే క్రమంలో ఇతరులు పలువురు ఇబ్బందులకు గురయ్యారు. మెట్రో స్టేషన్లోకి వెళ్లేందుకు మెట్ల వద్ద ఉన్న డోర్‌ను కాసేపు క్లోజ్ చేయడంతో.. చిన్నపిల్లలతో అరగంటపాటు మహిళలు, ఇతర ప్రయాణికులు మెట్లపై నిల్చునున్నారు. దీంతో అసహనానికి గురైన కొందరు మహిళా ప్రయాణికులు ఇదేంటి అంటూ పోలీసులను నిలదీశారు. ఇక ప్లకార్డులతో మెట్రో కింద ఫోటోలకు ఫోజులిచ్చిన కొంతమంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు వెంటనే అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లారు. ‘Let’s Metro for CBN’ protest by travelling from Miyapur-LB Nagar was held in #Hyderabad metro by supporters of Chandrababu Naidu, by wearing black t-shirts. Police and passengers stopped them from causing inconvenience to public pic.twitter.com/KxIx0vTKN6 — Naveena (@TheNaveena) October 14, 2023 -
హైదరాబాద్: మాదాపూర్ లో వైఎస్ఆర్ సీపీ ఐటీ వింగ్ సదస్సు
-
లక్ష మందితో వైఎస్సార్ సీపీ ఐటీ సైన్యం
సాక్షి, హైదరాబాద్: ఏపీలోని అధికార వైఎస్సార్సీపీకి చెందిన ఐటీ విభాగం వినూత్నంగా లక్ష మంది ఐటీ ప్రొఫెషనల్స్‌తో ఒక భారీ ఐటీ సైన్యాన్ని రూపొందిస్తోంది. దీనికి సంబంధించి మిషన్ ఐటీ ఆర్మీని ఆ పార్టీ ఐటీ విభాగ రాష్ట్ర అధ్యక్షులు సునీల్‌కుమార్ రెడ్డి పోసింరెడ్డి శనివారం ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఆ పార్టీ ఐటీ విభాగం ఐటీ ప్రొఫెషనల్స్‌తో ఒక భారీ సదస్సును నిర్వహించింది. ఈ సదసుకు హైదరాబాద్ జంటనగరాల్లోని వైఎస్సార్ సీపీఅభిమానులైన ఐటీ ఉద్యోగులు, రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ ఐటీ ప్రొఫెషనల్స్ భారీ ఎత్తన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి ఒక బలమైన శక్తిమంతమైన ఐటీ సైన్యం ఉండాలని తాము భావించామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మిషన్ ఐటీ ఆర్మ పేరిట వైసీపీకి ఒక భారీ ఐటీ ఆర్మీని ఆవిష్కరిస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీఐటీ విభాగానికి 5 లక్షలకు పైగా సభ్యత్వముందన్నారు. వీరిలో కనీసం లక్ష మందితో బలీయమైన ఐటీ సైన్యాన్ని ఏర్పాటు చేసి పార్టీ సేవలకు అంకితం చేయాలనే ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్‌ను ప్రారంభించామన్నారు. పార్టీ అభిమానులైన ఐటీ నిపుణులు, ఉద్యోగులంతా కూడా ఈ సైన్యం చేరి తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. దీని కోసం ప్రత్యేక పోర్టల్‌ను ఆరంభించామన్నారు. వైఎస్సార్ సీపీఐటీ సైన్యం అంతా కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడ గ్రామీణ యువత, గ్రామాల్లోని ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లతో మమేకమవుతారని, వారి సాధకబాధలు తెలుసుకుని వారికి మంచి ఉద్యోగావకాశాలు లభించేలా ఈ వేదిక కృషి చేస్తుందన్నారు. అలాగే పార్టీ విజయాలను, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాధించిన విజయాలను, సంక్షేమ కార్యక్రమ ఫలాల గురించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళతామన్నారు. ఈ తరహా సదస్సులను దేశంలోని ముఖ్య పట్టణాల్లో నిర్వహించి ఆ ప్రాంతాల్లోని ఐటీ ప్రొఫెషనల్స్‌తో అనుసంధానమవుతామన్నారు. ఐటీ వింగ్ పార్టీకి, పార్టీ అభిమానులైన ఐటీ ప్రొఫెషనల్స్‌కు మధ్య ఒక వారధిగా వ్యవహరిస్తుందన్నారు. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ వ్యాపారం తాను ఐటీ అభివృద్ధి చేశానని టీడీపీ నేత చంద్రబాబు నిత్యం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటారని సునీల్ కుమార్ రెడ్డి దుయ్యబట్టారు. నిజానికి హైదరాబాద్‌లో ఐటీ ప్రగతికి బీజం పడింది మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డ హయాంలో అయితే తదనంతరం ఐటీ ఊపందుకుంది మాత్రం వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలోనేనని, ఇవేవో దాచేస్తే దాగే గణాంకాలు కావని, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కలేనని చెప్పారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ పేరిట ఆయన హంగామా చేసి తన వాళ్ల చేత భూములు కొనిపించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని విమర్శించారు. అమరావతిలో కూడా అలాగే రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రాష్ట్రాన్ని ముంచేశారన్నారు. కోవిడ్ కష్టాలు చుట్టుముట్టినా కూడా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ రాష్ట్రాన్ని ప్రగతి పథంవైపు సమర్థవంతంగా నడిపిస్తున్నారని ఆయన అన్నారు. ఈ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో పారిశ్రామిక, ఐటీ అభివృద్ది ఊపందుకుంటోందన్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీవైపు చూస్తోందని, విశాఖపట్నం ప్రఖ్యాత ఐటీ కేంద్రంగా అభివృద్ధి చెంది, దేశంలోని పెద్ద పెద్ద నగరాలతోనే పోటీపడబోతోందన్నారు. ఇప్పటికే ఇక్కడ అదాని లాంటి సంస్థ అతి పెద్ద డాటా కేంద్రాన్ని ఏర్పాటు చేసి 50వేల ఉద్యోగాలు కల్పించబోతోందన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన ఐటీ విధానపత్రం ద్వారా రాబోయే మూడేళ్లలో మరో 50వేల ఉద్యోగాలు ఈ రంగంలో కల్పించబోతున్నామన్నారు. వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా, ప్రజలందరిపైనా ఉందన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమాంతంగా నిర్వహిస్తూ ప్రజలను ప్రగతిపథంవైపు నడిపిస్తున్న జగన్ ప్రభుత్వం మళ్లీ కొనసాగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ నిర్దేశించిన టార్గెట్ 175 సాధించి తీరే వరకు ఐటీ సైన్యం విశ్రాంతి లేకుండా కృషి చేయాలని కోరారు. ఐటీ ప్రొఫెషనల్స్ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకించి దృష్టి సారిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆయన ఐటీ ప్రొఫెషనల్స్‌తో మాటా మంతి నిర్వహించి పార్టీ బలోపేతానికి వారి నుంచీ విలువైన సలహాలు, సూచనలు స్వీకరించారు. -
HYD: జూన్ 3న వైఎస్సార్సీపీ ఐటీ విభాగ సదస్సు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఐటీ విభాగం జూన్ 3వ తేదీ హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు, ప్రొఫెషనల్స్‌తో ఒక భారీ సదస్సును నిర్వహిస్తోంది. హైటెక్ సిటీలోని బుట్టా కన్వెన్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. ఈ సదస్సుకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సమావేశానికి హైదరాబాద్ నగరంతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగులను పెద్ద సంఖ్యలో ఆహ్వానిస్తున్నారు. వైస్సార్సీపీ ఐటీ విభాగం అధ్యక్షులు సునీల్ కుమార్ రెడ్డి పోసింరెడ్డి అధ్యక్షతన ఈ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో వైస్సార్సీపీ పార్టీ బలోపేతానికి అనుసరించాల్సిన వ్యూహం గురించి, ఐటీ ఉద్యోగుల సమస్యలపైన సమగ్రంగా చర్చిస్తారు. ఈ సదస్సుకు వైస్సార్సీపీని అభిమానించే ఐటీ ఉద్యోగులందరూ తప్పకుండా హాజరై సదస్సును విజయవంతం చేయాలని సునీల్ కుమార్ రెడ్డి కోరారు. సదస్సుకు హాజరు కాదలచినవారు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 7829922666, 7032597980 నెంబర్లలో సంప్రదించాలని ఆయన సూచించారు. ఇది కూడా చదవండి: పేదల తరుపున ప్రభుత్వం పోరాడింది.. ఇక అమరావతి అందరిది: వెంకటపాలెం సభలో సీఎం జగన్ -
హోదా కోసం డిజిటల్ మీడియాలోనూ ప్రచారం
-
‘సీఆర్డీఏ ఐటీ’కి స్మార్ట్ గవర్నెన్స్ అవార్డు
తుళ్లూరు : తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో ఐటీ విభాగానికి స్మార్ట్ గవర్నెన్స్ అవార్డు దక్కినట్లు సీఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఆర్డీఏ పరిధిలో ఐటీ విభాగానికి సంబంధించి బాధ్యతలు నిర్వహించిన ఐటీ విభాగ అధికారి నక్కల ప్రభాకర్‌రెడ్డికి ఈ అవార్డు దక్కినట్లు వివరించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాలులో స్కాచ్ సంస్థ 45వ జాతీయోత్సవంలో భాగంగా ఈ అవార్డు ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో, అతి తక్కువ సిబ్బందితో ఐటీ టెక్నాలజీ ఉపయోగించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకుగాను ఈ అవార్డు లభించిందని అవార్డు అందుకున్న ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. -
YSRCP ఐటి వింగ్ సభ్యుడు హర్షతో వేదిక