‘సీఆర్‌డీఏ ఐటీ’కి స్మార్ట్ గవర్నెన్స్ అవార్డు
తుళ్లూరు : తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయంలో ఐటీ విభాగానికి స్మార్ట్ గవర్నెన్స్ అవార్డు దక్కినట్లు సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఆర్‌డీఏ పరిధిలో ఐటీ విభాగానికి సంబంధించి బాధ్యతలు నిర్వహించిన ఐటీ విభాగ అధికారి నక్కల ప్రభాకర్‌రెడ్డికి ఈ అవార్డు దక్కినట్లు వివరించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాలులో స్కాచ్ సంస్థ 45వ జాతీయోత్సవంలో భాగంగా ఈ అవార్డు ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలో, అతి తక్కువ సిబ్బందితో ఐటీ టెక్నాలజీ ఉపయోగించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించినందుకుగాను ఈ అవార్డు లభించిందని అవార్డు అందుకున్న ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.