Itely
-
రంగంలోకి లక్షమంది పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా (కోవిడ్-19) వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్భందనం చోటు చేసుకుంటోంది. ఇతర దేశాల ప్రజలు రాకుండా సరిహద్దులను పూర్తిగా మూసివేయాలని తాజాగా ఐరోపా కూటమి నిర్ణయించింది. యూరప్ ప్రయాణికులు రాకుండా ఆఫ్రికా దేశాలు నిషేధం విధించాయి. ఇతర దేశాలు అంతర్జాతీయ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. కోరనా కోరల్లో చిక్కుకున్న ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో సంపూర్ణ ప్రజా దిగ్భందనం అమలు చేస్తున్నాయి. ఇళ్ల నుంచి బయటికి రాకుండా ప్రజలను కట్టడి చేశాయి. విద్యా సంస్థలను, మాల్స్‌ను, మార్కెట్లను, థియేటర్లను మూసివేశాయి. సభలు, సమావేశాలు, మత కార్యాక్రమాలపై ఆంక్షలను విధించాయి. పలు ఐటీ కంపెనీలు ఇంటి నుంచి పని చేసేందుకు ఉద్యోగులను అనుమతించాయి. నిషేధాజ్ఞలను కచ్చితంగా అమలు చేయడానికి ఫ్రాన్స్‌లో లక్షమంది పోలీసులను రంగంలోకి దింపారు. (కరోనా: ఒక్కరోజే 475 మంది మృతి) భారత్ తదితర ఆసియా దేశాల్లో విద్యా సంస్థలను, థియేటర్లను మూసివేశారు. పెళ్లి, వినోద కార్యక్రమాలపె తాత్కాలిక ఆంక్షలను విధించారు. అమెరికాలో పది మందికి మించి ప్రజలు సంచరించరాదంటూ నిషేధాజ్ఞలు విధించారు. కోవిడ్ అనుమానితులను వెంటనే నిర్బంధ ఆరోగ్య శిబిరానికి తరలించాలంటూ అధికారులను ఆదేశించారు. మరో ఎనిమిది వారాలపాటు నిషేధాజ్ఙలు అమల్లో ఉంటాయని అమెరికా రోగ నియంత్రణా కేంద్రాలు భావిస్తున్నాయి. నిషేధాజ్ఞలు మరికొన్ని నెలలపాటు కొనసాగించాల్సి రావచ్చని పలు దేశాలు భావిస్తున్నాయి. 2021 సంవత్సరంలో కరోనాను నిరోధించే వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. (‘హృదయ విదారకం.. కన్నీళ్లు ఆగడం లేదు’) ప్రపంచ ఆర్థిక వ్యవస్థపె కూడా కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. ప్రపంచ ఆర్థిక స్టాక్ మార్కెట్లకు ఒక్క ఫిబ్రవరి ఆఖరి వారంలోనే ఐదు లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. అమెరికా ఫెడరల్ బ్యాంక్ నుంచి యురోపియన్ సెంట్రల్ బ్యాంక్ వరకు ఆర్థిక సంక్షోభాన్ని నిరోధించేందుకు వడ్డీ రేటును గణనీయంగా తగ్గించాయి. అమెరికా ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేటును దాదాపు జీరో చేసింది. చైనా నుంచి జర్మనీ వరకు ఆస్ట్రేలియా నుంచి అమెరికా వరకు అసాధారణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరో పక్క అంతర్జాతీయంగా చమురు రేట్లు పతనమయ్యాయి. మొదట తీవ్రంగా కరోనా బారిన పడిన చైనా, దక్షిణ కొరియా దేశాల్లో కఠిన చర్యల ద్వారా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఎక్కువ మరణాలు సంభవించిన ఇటలీలోనే పరిస్థితి తీవ్రంగా ఉంది. (మాస్క్‌లు, గ్లోవ్స్ కంటే ఇదే ముఖ్యం) -
ఐటీ కంపెనీల్లో ఖాళీ అవుతున్న ‘బెంచీ’లు
న్యూఢిల్లీ: అమెరికా లాంటి దేశాల ఆంక్ష లు, యాంత్రీకరణ పెరగడం వల్ల భారత ఐటీ దిగ్గజ సంస్థల్లోకూడా బెంచీలు ఖాళీ అవుతున్నాయి. ఐటీ కంపెనీల్లో ఇది వరకు బెంచీకి ఎనిమిది నుంచి పది మంది ఉండగా ఇప్పుడా సంఖ్య నాలుగు నుంచి ఐదుకు పడిపోయిందని మానవ వనరుల అభివద్ధి శాఖకు చెందిన నిపుణులు తెలియజేస్తున్నారు. ఐటీ రంగంలో ప్రస్తుతం పనిచేయడానికి ఏ ప్రాజెక్ట్ లేకపోయినా, భవిష్యత్ ప్రాజెక్టులకు పనికొస్తారన్న నమ్మకంతో రిజర్వ్‌లో ఉంచే ఉద్యోగులను బెంచీ ఉద్యోగులుగా వ్యవహరిస్తారు. వారిని కూడా రెగ్యులర్ రోల్స్‌లోనే ఉంచి ఇతర ఉద్యోగులలాగానే జీతభత్యాలు ఇస్తారు. ‘సిట్టింగ్ ఆన్ ది బెంచ్’ అనే పదం ఫుట్‌బాల్ ఆట నుంచి వచ్చిందంటారు. ఫుట్‌బాల్ ఆడేది 11 మంది క్రీడాకారులే అయినా అయిదారు ఆటగాళ్లు ఎక్స్ట్రా ఉంటారు. రెగ్యులర్ ఆటగాళ్లు గాయపడ్డ సందర్భాల్లో వారికి బదులుగా వీరు ఆడతారు. వీరిని ‘సిట్టింగ్ ఆన్ ది బెంచ్’ క్రీడాకారులు అని వ్యవహరిస్తారు. ఇలా ఎక్స్ట్రా ఉద్యోగులను ఐటీ పరిశ్రమలో ఉద్యోగుల బ్యాంక్ అని కూడా పిలుస్తారు. బ్యాంక్ అన్న పదం ఇటలీలోని బెంచీ నుంచే వచ్చిందట, 14వ శతాబ్దంలో ఇటలీలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ ఉద్యోగులు బెంచీల మీద కూర్చొని పనిచేసేవారని, ఆ బెంచీ పదం మీదనే బ్యాంక్ అనే పదం పుట్టుకొచ్చిందని ‘ది యాక్సెంట్ ఆఫ్ మనీ’ పుస్తకంలో రచయిత నీల్ ఫర్గూసన్ తెలిపారు. ‘అన్ని వేళల్లో మా వద్ద బెంచీపై తక్కువ ఉద్యోగులే ఉంటారు. దీన్ని మేము ప్రణాళికా కాలమని కూడా అంటాం. ఈ కాలంలో ఉద్యోగులు పని నేర్చుకుంటారు. అలాగే తమ అంతర్గత సజనాత్మకతపై దష్టిని కేంద్రీకరిస్తారు’ అని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. ఈ బెంచీని ఐటి కంపెనీలు పరస్పరం భిన్నంగా కూడా చూస్తాయి. ప్రాజెక్ట్ ఇవ్వడమే తరువాయి, పనిచేసి పెట్టడానికి తమవద్ద తగినన్ని మానవ వనరులు ఉన్నాయని కస్టమర్లను నమ్మించడానికి, తమ సంస్థ ఆర్థికంగా కూడా బలమైనదని చెప్పడానికి ఈ బెంచీలను ఉపయోగిస్తే, లాభాలను తగ్గించుకోవడమే అవుతుందన్న ఉద్దేశంతో కొన్ని కంపెనీలు బెంచీల సైజును నామమాత్రంగానే ఉంచేవి. నైపుణ్యం పెంచుకోవడానికి, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఈ బెంచీలు బాగా ఉపయోగపడేవని ఓ ఐటీ కంపెనీలో 16 నెలల పాటు బెంచీపై కూర్చున్న ఇందిర రాఘవన్ అనే ఐటీ ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఇదివరకు ఐటీ కంపెనీల్లో బెంచీపైన 30 శాతం మంది ఉద్యోగులు ఉంటుండగా, 70 శాతం మంది ఉద్యోగులు ప్రాజెక్టులపై పనిచేసే వారని, ఇప్పుడు బెంచీ సంఖ్య 19–20కి, పనిచేసే ఉద్యోగుల సంఖ్య 80–81 శాతంగా మారిందని ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో విశాల్ సిక్కా తెలిపారు. బ్యాంక్ అని పిలిచినా, బెంచీ అని పిలిచినా ఇప్పుడు ఐటీ దిగ్గజ సంస్థల్లో రిజర్వ్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం. ఇప్పుడు బెంచీకి బదులుగా ఐటీ సంస్థలు ‘జస్ట్ ఇన్ టైమ్’ అనే విధానానికి శ్రీకారం చుట్టాయి. ఈ జాబితో వున్న ఉద్యోగులకు జీత భత్యాలు ఇవ్వరు. ప్రాజెక్టు వచ్చినప్పుడు మాత్రమే వీరిని పిలుస్తారు. ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు వారిని కాంట్రాక్ట్‌పై ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత ఇంటికి పంపించి వేస్తారు. ఈ విధానం కారణంగా ఇక ఐటీ కంపెనీల్లో శాశ్వత లేదా దీర్ఘకాల ఉద్యోగులంటూ ఉండరు. -
జైలు ఊచలు లెక్కపెట్టనున్న తొలి సీఐఏ అధికారిణి
వాషింగ్టన్: ఒకప్పుడు సంచలనం సృష్టించిన వివాదాస్పద కౌంటర్ టైజమ్ కేసులో అమెరికా సీఐఏ రిటైర్డ్ అధికారిణి సబ్రినా డి సౌసాకు ఇటలీలో జైలు శిక్ష పడనుంది. ప్రస్తుతం పోర్చుగల్‌లో ఉన్న ఆమెను ఇటిలీకి తీసుకెళ్లి నాలుగేళ్లపాటు జైల్లో నిర్బంధించనున్నారు. అదేగనుక జరిగితే కౌంటర్ టెర్రరిస్టుల కార్యకాలాపాల్లో జైలు శిక్ష పడిన తొలి సీఐఏ అధికారి ఆమె అవుతుంది. 2001లో అమెరికాపై టెర్రరిస్టులు జరిపిన సెప్టెంబర్ దాడుల అనంతరం ప్రపంచవ్యాప్తంగా టెర్రరిస్టులను మట్టుపెట్టాలన్న లక్ష్యంతో అమెరికా సీఐఏ పలు దేశాల్లో రహస్య ఆపరేషన్లను నిర్వహించింది. ఎంతోమంది అనుమానితులను కిడ్నాప్‌చేసి వారిని కోర్టు ముందు హాజరుపర్చకుండానే రహస్య జైళ్లలో నిర్బంధించింది. ఇలాంటి కౌంటర్ టెర్రరిస్టు చర్యల్లో భాగంగానే 2003లో ఇటలీలోని మిలన్లో మసీదుకు వెళుతున్న అబూ ఒమర్ అనే ముస్లిం మత గురువును కిడ్నాప్ చేసింది. అప్పుడు ఈ కిడ్నాప్ కేసు ఎంతో సంచలనం సృష్టించింది. ఈజిప్టుకు చెందిన అబూ ఒమర్ 2001లో ఇటలీలో ఆశ్రయం పొందడంతో ఆయనకు టెర్రరిస్టులతో సంబంధం ఉందని అనుమానించిన సీఐఏ అధికారులు, ఇటలీ ఇంటెలిజెన్స్ అధికారులతో కలసి రహస్య ఆపరేషన్ నిర్వహించారు. అందులో భాగంగా 2003, ఫిబ్రవరి 17వ తేదీన ముస్లిం మత గురువు అబూ ఒమర్‌ను కిడ్నాప్ చేశారు. రహస్య స్థలంలో నిర్బంధించి ఆయన్ని చిత్రహింసలకు గురిచేశారు. 2007 వరకు జైల్లో నిర్బంధించి ఆ తర్వాత విడుదల చేశారు. ఈ కిడ్నాప్ జరిగిన కొన్ని రోజుల్లోనే అమెరికా సీఐఏ అధికారులే కిడ్నాప్ చేశారనే విషయాన్ని మీడియా బయటపెట్టింది. ఈ కిడ్నాప్ వెనక అమెరికా ప్రభుత్వం హస్తం ఉందన్న కారణంగా ఈ సంఘటన సంచలనం సృష్టించలేదు. సీఐఏ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సంచలనం సృష్టించింది. సీఐఏ అధికారులు వెళ్లిన ప్రతి చోట, బస చేసిన హోటళ్లలో ఆధారాలు వదిలిపెట్టారు. ట్రేస్ చేయడానికి వీలున్న సెల్యూలార్ ఫోన్లలో మాట్లాడుకున్నారు. వారి టెలిఫోన్ నెంబర్లు, బస చేసిన హోటళ్ల బిల్లులు సహా పలు ఆధారాలు దొరికాయి. అప్పుడు ఇటలీలోనే సీఐఏ అధికారిగా పనిచేస్తున్న సబ్రినా డి సౌసౌకు ఈ ఆపరేషన్‌తో సంబంధం ఉందనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తొలుత ఈ కేసును ఇటలీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత వివిధ వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు దర్యాప్తు చేపట్టింది. 26 మంది అమెరికా సీఐఏ అధికారులు ఈ కిడ్నాప్ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తేలింది. అప్పటికే కిడ్నాప్ కేసుతో సంబంధం ఉన్న సబ్రినా సహా పలువురు అధికారులు దేశం విడిచి వెళ్లిపోయారు. కోర్టులో ఈ కేసు విచారణ నిందితులు లేకుండానే జరిగింది. 2007లో వారిని దోషులుగా ఇటలీ కోర్టు ప్రకటించింది. 26 మందిలో 23 మందికి జైలు శిక్ష విధిస్తూ ఇటలీ కోర్టు 2009లో తీర్పు చెప్పింది. ఇటలీలోనే ఉద్యోగం చేసిన కారణంగా సబ్రినా, మరో ఇద్దరు సీఐఏ అధికారుల వివరాలు మాత్రం కేసులో నమోదై ఉన్నాయి. మిగతా వారి వివరాలు లేవు. వారెవరో కూడా తెలియదు. 2009లోనే రిటైర్డ్ అయిన సబ్రినాకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. భారత్‌లో పుట్టి అమెరికా పౌరసత్వం కలిగిన సబ్రినా రిటైరయ్యాక అమెరికాలోనే ఉంటున్నారు. ఆమె తన కుటుంబ సభ్యులను కలసుకునేందుకు పోర్చుగల్‌లోని లిస్బాన్‌కు 2015, ఏప్రిల్ నెలలో వెళ్లారు. అక్కడి నుంచి అక్టోబర్ నెలలో భారత్‌లోని గోవాకు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్లగా పోర్చుగీసు అధికారులు ఆమెను అరెస్టు చేశారు. ఆమెను ఇటలీకి అప్పగించే ప్రయత్నాల్లో పోర్చుగీసు అధికారులు ఉండగా, ఆమె తన కేసును మళ్లీ విచారించాలంటూ ఇటలీ కోర్టులో అమెరికా న్యాయవాది ద్వారా అప్పీల్ చేసుకున్నారు. సీఐఏ ఇప్పుడు తనకు అండగా నిలబడే పరిస్థితి కనిపించడం లేదని, ఇటలీకి వెళ్లాక తనను నాలుగేళ్లపాటు జైల్లో పెట్టవచ్చని ఆమె అక్కడి నుంచి టెలిఫోన్ ద్వారా అమెరికా మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదే కేసులో తనకన్నా ముందు అరెస్టైన ఇద్దరు సీఐఏ సీనియర్ అధికారులకు ఇటలీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టిందని, తనకు అలాంటి అవకాశం కనిపించడం లేదని సబ్రినా వాపోయారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇటలీ అధ్యక్షుడితో జరిపిన చర్చల కారణంగా ఆ ఇద్దరు అధికారులకు క్షమాభిక్ష లభించింది.