item numbers
-
ఐటెం పాటలు తుస్..!
టాలీవుడ్ లో ఐటెం పాటలు ఆకట్టుకోలేపోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2014లో విడుదలైన తెలుగు సినిమాల్లో ప్రత్యేక గీతాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అగ్రతారలు చేసిన ఐటెం పాటలు అభిమానుల అంచనాలను అందుకోలేక తేలిపోయాయి. నిరుడు 'మిర్చి' ఘాటుతో కుర్రకారును ఊర్రూతలూగించిన హంసానందిని కూడా ఈ ఏడాది మెప్పించలేకపోయింది. లెజెండ్, లౌక్యం సినిమాల్లో అమ్మడు నర్తించిన పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆగడులో శృతిహాసన్, అల్లుడు శ్రీనులో తమన్నా చేసిన ప్రత్యేక గీతాలు ప్రభావం చూపలేకపోయాయి. ఎవడు సినిమాలోయ రాంచరణ్ తో దీటుగా స్కార్లెట్ విల్సన్ స్టెప్పులేసినా స్పందన అంతంతమాత్రమే. మూసధోరణిలో ఉండడం వల్లే ప్రత్యేక గీతాలు ఆదరణ కోల్పోతున్నాయని చెబుతున్నారు. పాటలన్నీ దాదాపు ఒకే ఫ్లోలో ఉండడం, నృత్య భంగిమల్లో నవ్యత కొరవడడం కూడా కారణమంటున్నారు. -
ఐటెం సాంగ్‌లు చేయను: విద్యాబాలన్
'ఫెరారీ కీ సవారీ' చిత్రంలో ఐటెం సాంగ్‌లో డాన్సు చేసిన విద్యాబాలన్.. ఇక మీదట అలాంటి పాటలు చేసేది లేదని స్పష్టం చేసింది. అవి చేయడం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పేసింది. 'బాబీ కో సబ్ మాలూమ్ హై' అనే బ్లాగ్ ప్రారంభ కార్యక్రమంలో విద్యాబాలన్ పాల్గొంది. తాను నటించిన 'బాబీ జాసూస్' చిత్రం ప్రమోషన్ కోసం ఈ కార్యక్రమానికి వెళ్లింది. అందులో ఆమె డిటెక్టివ్ పాత్ర పోషిస్తోంది. అక్కడే విలేకరులు ఆమెను భవిష్యత్తులో కూడా ఐటెం సాంగ్స్ చేస్తారా అని ప్రశ్నించగా, ఇక మీదట తనను ఎవరూ ఐటెం సాంగ్స్‌లో చూడలేరని స్పష్టం చేసింది. బాబీ జాసూస్ చిత్రం జూలై 4న విడుదల కానుంది. సమర్ షేక్ దర్శకత్వంలో దియా మీర్జా, ఆమె కాబోయే భర్త సాహిల్ సంగా కలిసి నిర్మించిన ఈ సినిమాలో అలీ ఫజల్ కూడా నటించాడు.