ఐటెం పాటలు తుస్..!
టాలీవుడ్ లో ఐటెం పాటలు ఆకట్టుకోలేపోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. 2014లో విడుదలైన తెలుగు సినిమాల్లో ప్రత్యేక గీతాలు పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అగ్రతారలు చేసిన ఐటెం పాటలు అభిమానుల అంచనాలను అందుకోలేక తేలిపోయాయి.
నిరుడు 'మిర్చి' ఘాటుతో కుర్రకారును ఊర్రూతలూగించిన హంసానందిని కూడా ఈ ఏడాది మెప్పించలేకపోయింది. లెజెండ్, లౌక్యం సినిమాల్లో అమ్మడు నర్తించిన పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆగడులో శృతిహాసన్, అల్లుడు శ్రీనులో తమన్నా చేసిన ప్రత్యేక గీతాలు ప్రభావం చూపలేకపోయాయి.
ఎవడు సినిమాలోయ రాంచరణ్ తో దీటుగా స్కార్లెట్ విల్సన్ స్టెప్పులేసినా స్పందన అంతంతమాత్రమే. మూసధోరణిలో ఉండడం వల్లే ప్రత్యేక గీతాలు ఆదరణ కోల్పోతున్నాయని చెబుతున్నారు. పాటలన్నీ దాదాపు ఒకే ఫ్లోలో ఉండడం, నృత్య భంగిమల్లో నవ్యత కొరవడడం కూడా కారణమంటున్నారు.