తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులకు చేరువైన నటి హంసానందిని. రెండేళ్ల క్రితం రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఆమె గతేడాది డిసెంబర్‌లో ఆ మహమ్మారిని జయించింది. ఈ క్రమంలో తిరిగి సినిమాలపై దృష్టి సారించిన నటి తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టగా అది వైరల్‌గా మారింది. ఒక ఏడాది క్రితం క్యాన్సర్ ట్రీట్‌మెంట్‌లో భాగంగా జుట్టు కోల్పోయి గుండుతో ఉన్న వీడియో షేర్ చేసింది. అలాగే క్యాన్సర్‌ను జయించిన తర్వాత తిరిగి సాధారణ స్థితికి చేరుకున్న ఆమె సముద్రపు ఒడ్డున తన జుట్టు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేసింది.
'ఒక ఏడాదిలో చాలా జరిగాయి. ప్రస్తుతానికైతే బాగున్నాను' అని నటి రాసుకొచ్చింది. జుట్టు ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా అద్భుతంగా ఉన్నారు అని ఒకరు కామెంట్ చేయగా ఆ నెటిజన్‌పై ముద్దుల వర్షం కురిపించింది హంసానందిని. మిగతా నెటిజన్లు కూడా తనొక రియల్ ఫైటర్ అని కొనియాడుతున్నారు. కాగా హంసానందిని అత్తారింటికి దారేది, మిర్చి, లెజెండ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాల్లో ఐటం సాంగ్స్‌లో ఆడిపాడింది. లౌక్యం, రుద్రమదేవి, జై లవకుశ సహా పలు చిత్రాల్లోనూ నటించింది.
చదవండి: నాటునాటు పాటకు దుమ్ము దులిపిన పాక్ నటి, వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment