jabili
-
హైకోర్టుకు చేరిన జాబిలి మిస్సింగ్ మిస్టరీ
-
హైకోర్టుకు చేరిన జాబిలి మిస్సింగ్ మిస్టరీ
రంగారెడ్డి: శంషాబాద్ లో మిస్టరీ గా మారిన యువతి మిస్సింగ్ కేసు హైకోర్టుకు చేరింది. ఆఫీస్కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయినా లాభం లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జూలై 20 న ఆఫీస్కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన జాబిలి అనే యువతి తిరిగి ఇంటికి చేరలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా కూతురి ఆచూకీ లభించకపోవడంతో డీజీపీకి ఫిర్యాదు చేశారు. రెండు నెలలు దాటినా కూతురి జాడ తెలియకపోవడంతో.. ఆమె తల్లిదండ్రులు ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అక్టోబర్ 3 లోగా కౌంటర్ దాఖలు చేయాలని సైబరాబాద్ పోలీసులను న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. -
జాబిలికి శ్రీశ్రీ ప్రతిభా పురస్కారం
పెనుకొండకు చెందిన కవి జాబిలి ఛాంద్ బాష ఆదివారం రాజమండ్రిలో అధికార భాషా సంఘం అధ్యక్షులు పొట్లూరి రామకృష్ణ, నన్నయ, తెలుగు యూనివర్శిటీ ప్రొఫెసర్ టి. సత్యనారాయణ చేతుల మీదుగా శ్రీశ్రీ ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో కృషి చేసిన 30 మందికి ఈ పురస్కారాలను అందించగా జాబిలికి సాహితీ రంగంలో పురస్కారం వచ్చింది. జాబిలికి అవార్డు లభించినందుకు సోమవారం పట్టణ ప్రముఖులు షిర్డీ సాయి గ్లోబల్ ట్రస్ట్ నిర్వాహకులు భాస్కరరెడ్డి, దర్గా పీఠాధిపతి తాజ్బాబా, మాజీ సర్పంచ్ వైఎన్.కుమార్, మానవ హక్కుల డైరెక్టర్ జాన్ ప్రియనాథ్, ఖ్వాజా గరీబున్నవాజ్ ట్రస్ట్ చైర్మన్ రఫిక్ అహ్మద్ తదితరులు ఆయనను అభినందించారు.