హైకోర్టుకు చేరిన జాబిలి మిస్సింగ్‌ మిస్టరీ | shamshabad women missing case | Sakshi
Sakshi News home page

Published Thu, Sep 21 2017 3:23 PM | Last Updated on Fri, Mar 22 2024 11:03 AM

శంషాబాద్ లో మిస్టరీ గా మారిన యువతి మిస్సింగ్ కేసు హైకోర్టుకు చేరింది. ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ దొరకలేదు. దీంతో డీజీపీకి ఫిర్యాదు చేశారు. అయినా లాభం లేకపోవడంతో చివరకు హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జూలై 20 న ఆఫీస్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన జాబిలి అనే యువతి తిరిగి ఇంటికి చేరలేదు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement