Jagathala district
-
కొడుకు ఇక లేడని ఆగిన తల్లి గుండె
కథలాపూర్(వేములవాడ): ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్‌బాట పట్టిన కొడుకు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా.. ఆ విషయం తెలిసిన తల్లి గుండె ఆగిపోయింది. తల్లీకొడుకుల మృతితో జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోతారంలో విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన గుంటుక నర్మద–మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. అప్పులు పెరిగిపోవడం, ఉన్న ఊరిలో ఉపాధి లేకపోవడంతో ఇద్దరు కొడుకులు గల్ఫ్‌బాట పట్టారు. కాగా, చిన్నకొడుకు గుంటుక గణేశ్ ఈనెల 3న బహ్రెయిన్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు తెలిసింది. అప్పటి నుంచి గణేశ్ తల్లి నర్మద విలపిస్తూనే ఉంది. ఆదివారం ఉదయం నర్మద (58) ఆకస్మికంగా మృతిచెందింది. కాగా, మృతురాలి భర్త మల్లయ్య మూడేళ్ల క్రితం చనిపోయాడు. కొడుకు శవాన్ని చివరిచూపు చూడకుండానే తల్లి మృతిచెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఇప్పటివరకు కేంద్రంలో ఏం చక్రం తిప్పారు
జగిత్యాలరూరల్: రాష్ట్రం లో టీఆర్ఎస్కు ఇప్పటివరకు ఉన్న ఎంపీలతో కేం ద్రంలో ఏం చక్రం తిప్పా రని, రాష్ట్రాన్ని ఎంతగా అభివృద్ధి చేశారో చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీమంత్రి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీని తీసుకురావడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌కు గుర్తింపు తీసుకువచ్చేందుకు ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మంజూరు చేశామన్నారు. ఆ ప్రాజెక్ట్‌ను టీఆర్ఎస్ పక్కన పడేసిందన్నారు. ప్రాణహిత నదీ జలాలు తరలించేలా ఏర్పాట్లు చేసిన మేడిగడ్డ, తమ్మడిహెట్టికి జాతీయ ప్రాజెక్టు హోదా సాధించే అవకాశం ఉన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల హోదా రాలేదన్నారు. -
జగిత్యాల జిల్లాలో నీటిబావిలో చమురు
-
నేను, సీఎం..దోస్తులమే..
సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి రాయికల్ (జగిత్యాల): ముఖ్యమంత్రి కేసీఆర్, తాను దోస్తులమని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అయోధ్యలో గురు వారం విలేకరులతో మాట్లాడారు. అయితే, తమ పార్టీ సిద్ధాంతాలు వేరు కావడంతో కొంతవరకు ప్రజలు సమస్యలపై పోరాడుతు న్నామేగానీ తమ మధ్య ఎలాంటి విద్వేషాలూ లేవని చెప్పారు.