jagjivan ram jayanti
-
జగ్జీవన్ రామ్ జయంతికి సీఎం జగన్ నివాళి
సాక్షి, గుంటూరు: నేడు స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. స్వాతంత్య్రోద్యమ నేత, సంస్కరణవాది బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి నివాసంలో నివాళులర్పించిన సీఎం శ్రీ వైఎస్ జగన్. హాజరైన మంత్రి మేరుగ నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్, చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్. జవహర్ రెడ్డి, అధికారులు pic.twitter.com/IEMfIuzX3e — CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 5, 2023 -
జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశానికి బాబూ జగ్జీవన్‌రామ్ సేవలు చిరస్మరణీయమన్నారు. దళితుల సంక్షేమానికి కృషి చేసిన గొప్ప నాయకుడు జగ్జీవన్‌రామ్ అన్నారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని.. రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పాలన చేస్తున్నారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను పైకి తెచ్చే ప్రక్రియ ఒక యజ్ఞంలా సాగుతోందన్నారు. ఈ స్ఫూర్తి ఇలానే కొనసాగాలని.. పెద్దల ఆశయాలను నిజం చేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. చదవండి: బాబు జగ్జీవన్‌కు సీఎం జగన్ నివాళి ‘ఓ పార్టీలో పప్పు.. మరో పార్టీలో కామెడీ యాక్టర్’ ‘పవన్, లోకేష్.. ఇదో అజ్ఞానపు సంత’ -
కేంద్రం నమ్మించి మోసం చేసింది
సాక్షి, అమరావతి: ‘కేంద్రం నమ్మించి మోసం చేసింది. నేను నమ్మాను. మీ కోసం నమ్మాను. నాకు బీజేపీతో అవసరంలేదు. ప్రధానమంత్రితో అవసరంలేదు. రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని నమ్మి బీజేపీతో కలిశాం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో ప్రభుత్వం నిర్వహించిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. అందరికంటే సీనియర్ నాయకుడిని తానేనని, తన తరువాతే అందరూ వచ్చి సీఎంలు, పీఎంలు అయ్యారని చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అడిగానని.. రోజుకో మాట చెప్పి మొండిచేయి చూపించే పరిస్థితికి వచ్చారని.. అవమానించాలని చూస్తున్నారని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి విమర్శించారు. అంతకుముందు.. నగరంలోని రామవరప్పాడు సెంటర్లోని బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహానికి సీఎం పూలమాల వేసి నివాళులర్పించారు. -
ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు
సాక్షి, అమరావతి: వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏప్రిల్ 4, 5, 6వ తేదీల్లో నిర్వహించ తలపెట్టిన పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 5న శ్రీరామనవమి, జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని పరీక్ష తేదీల్లో కమిషన్ మార్పులు చేసింది. సవరించిన పరీక్షల షెడ్యూల్ ఈ విధంగా ఉంది.