జమ్ము కోర్టుకు పాక్ ఉగ్రవాది నవేద్
జమ్ము: ఉధంపూర్‌లో బీఎస్ఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి ఇద్దరు జవాన్లను కాల్చిచంపిన కేసులో పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ నవేద్‌ను ఎన్ఐఏ అధికారులు సోమవారం జమ్ము కోర్టులో ప్రవేశపెట్టారు. సీఆర్పీసీ సెక్షన్ 164 కింద.. చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎస్. గుప్తా ఎదుట నవేద్ వాగ్మూలాన్ని రికార్డు చేయనున్నట్లు కోర్టు వర్గాలు తెలిపాయి.
అయితే ఉగ్రవాది నవేద్ తన వాగ్మూలాన్ని స్వచ్ఛందంగా ఇస్తున్నాడని నిర్ధారించుకున్న తర్వాతే.. ఆ వాగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేస్తారని పేర్కొన్నాయి. తదుపరి విచారణను ఆగస్టు 26కు వాయిదా వేసిన న్యాయమూర్తి.. నవేద్‌కు రెండు రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు.
దాడి ఘటన అనంతరం గ్రామస్తుల చేతికి చిక్కిన నవేద్ ను విచారణ కోసం ఎన్ఐఏ అధికారులు ఢిల్లీకి తరలించించిన సంగతి తెలిసిందే. ఎన్ఐఏ విచారణలో నవేద్ తన నేరాన్ని అంగీకరించినట్లు వార్తలు వినవచ్చిన నేపథ్యంలో కోర్టులో కూడా అతను తన నేరాన్ని ఒప్పుకునే అవకాశాలున్నట్లు తెలిసింది.