japan grandprix
-
జపాన్ గ్రాండ్‌ప్రి విజేత బొటాస్
సుజుకా: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో 12 రేసుల అనంతరం మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మరో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో బొటాస్ 53 ల్యాప్‌ల ప్రధాన రేసును అందరి కంటే ముందుగా గంటా 21 నిమిషాల 46.755 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. వెటెల్ రెండో స్థానంలో... మరో మెర్సిడెస్ డ్రెవర్ హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. ఈ రేసుతో మెర్సిడెస్ జట్టు మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే 2019 కన్స్ట్రక్టర్స్ టీమ్ టైటిల్‌ను దక్కించుకుంది. -
ఎఫ్1 డ్రైవర్ బియాంచి మృతి
9 నెలలుగా కోమాలోనే గతేడాది జపాన్ గ్రాండ్‌ప్రిలో ప్రమాదం నైస్ (ఫ్రాన్స్): ఫార్ములావన్ చరిత్రలో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలలుగా మృత్యువుతో పోరాడుతున్న ఎఫ్1 డ్రైవర్ జూలెస్ బియాంచి శుక్రవారం రాత్రి మరణించాడు. గతేడాది అక్టోబర్ 5న జపాన్ గ్రాండ్‌ప్రిలో వర్షంలో దూసుకెళుతున్న అతని కారు అదుపు తప్పి ట్రాక్ పక్కనున్న రికవరీ వెహికల్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో కారు నుజ్జునుజ్జు కాగా... ఆ రేసులో మనోర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 25 ఏళ్ల బియాంచి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అప్పటి నుంచి ఈ ఫ్రెంచ్ డ్రైవర్ నైస్ పట్టణంలోని తన ఇంటికి దగ్గరలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫార్ములావన్ చరిత్రలో ఇప్పటికి 36 మంది డ్రైవర్లు తమ ప్రాణాలు వదలగా... చివరిసారిగా 1994లో ప్రఖ్యాత డ్రైవర్ అయిర్టన్ సెన్నా దుర్మరణం చెందాడు. ‘జూలెస్ తన సహజ గుణానికి తగ్గట్టుగానే మృత్యువుతో చివరి వరకు పోరాడాడు. అయితే మమ్మల్ని విషాదంలో ముంచి తను పోరాటాన్ని చాలించాడు’ అని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. 2013, 2014 సీజన్లలో మనోర్ జట్టు తరఫున బియాంచి 34 రేసులను పూర్తి చేశాడు. గతేడాది మొనాకో గ్రాండ్‌ప్రిలో తొమ్మిదో స్థానంలో నిలిచి తమ జట్టుకు తొలిసారిగా చాంపియన్‌షిప్ పాయింట్లను అందించాడు. -
వెబెర్‌కు తొలి ‘పోల్’
సుజుకా (జపాన్): తన సహచరుడు సెబాస్టియన్ వెటెల్ విజయాల నీడలో వెనుకబడిపోయిన మార్క్ వెబెర్ (రెడ్‌బుల్) ఈ సీజన్లో తొలిసారి ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచాడు. శనివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో వెబెర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 30.915 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ ఏడాది తొలిసారి ‘పోల్ పొజిషన్’ సంపాదించాడు. ఈ ఏడాది తర్వాత ఫార్ములావన్‌కు వీడ్కోలు చెప్పనున్న ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ ప్రస్తుత సీజన్లో ఒక్క విజయాన్నీ నమోదు చేయలేకపోయాడు. మరోవైపు వెబెర్ సహచరుడు వెటెల్ క్వాలిఫయింగ్‌లో రెండో స్థానంలో నిలిచాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ల ద్వయం వరుసగా తొలి రెండు స్థానాల నుంచి ప్రారంభించనుంది. వెబెర్ ‘పోల్ పొజిషన్’ సాధించినా... వరుసగా నాలుగు విజయాలతో జోరుమీదున్న వెటెల్పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 272 పాయింట్లతో ఆధిక్యంలో ఉన్న వెటెల్ ఆదివారం జరిగే రేసులో విజయం సాధించి.... 195 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న ఫెర్నాండో అలోన్సో (ఫెరారీ) టాప్-8లో నిలువకపోతే.... సీజన్లో మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే వెటెల్‌కు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమవుతుంది. సుటిల్పై పెనాల్టీ క్వాలిఫయింగ్ సెషన్లో భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లకు నిరాశ మిగిలింది. పాల్ డి రెస్టా 12వ స్థానంలో... సుటిల్ 17వ స్థానంలో నిలిచారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా సుటిల్ గేర్ బాక్స్‌ను మార్చడంతో అతనిపై ఐదు గ్రిడ్ల పెనాల్టీని విధించారు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును సుటిల్ చివరిదైన 22వ స్థానం నుంచి మొదలుపెడతాడు.