
సుజుకా: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో 12 రేసుల అనంతరం మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మరో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం జరిగిన జపాన్ గ్రాండ్‌ప్రిలో బొటాస్ 53 ల్యాప్‌ల ప్రధాన రేసును అందరి కంటే ముందుగా గంటా 21 నిమిషాల 46.755 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. వెటెల్ రెండో స్థానంలో... మరో మెర్సిడెస్ డ్రెవర్ హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు. ఈ రేసుతో మెర్సిడెస్ జట్టు మరో నాలుగు రేసులు మిగిలి ఉండగానే 2019 కన్‌స్ట్రక్టర్స్ టీమ్ టైటిల్‌ను దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment