japan minister
-
స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు భారత్ కీలకం
న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్ సాధనలో భారత్ అనివార్య భాగస్వా మి అని జపాన్ విదేశాంగ మంత్రి యోషిమస హయా షి పేర్కొన్నారు. భారత్‌తో అన్ని రంగాల్లో ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం బలోపేతం చేసుకునేందుకు జపాన్ ఆసక్తితో ఉందన్నారు. గ్లోబల్ సౌత్‌పై దృష్టిసారించిన భారత్‌ను హయాషి ప్రశంసించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు సరైన శ్రద్ధ చూపకుంటే స్వేచ్ఛాయుత, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమత ఒట్టి నినాదంగానే మారిపోతుందన్నారు. భారత్‌కు రెండు రోజుల పర్యటనకు వచ్చిన హయాషి శుక్రవారం విదేశాంగ ఏర్పాటు చేసిన భారత్–జపాన్ ఫోరం సమావేశంలో మాట్లాడారు. సైబర్, అంతరిక్ష రంగాల్లో రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించామన్నారు. రక్షణ ఉత్పత్తులు, సాంకేతిక అంశాలకు సంబంధించిన చర్చల్లో సహకారంపై చర్చలు సాగుతున్నాయని వివరించారు. ఈ చర్చలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ..భారత్‌కు జపాన్ సహజ భాగస్వామిగా పేర్కొన్నారు. -
మేకప్ స్కాం: జపాన్ మహిళా మంత్రి రాజీనామా
రాజకీయ విరాళాలను తన మేకప్ కోసం వాడుకున్నారన్న ఆరోపణలతో.. జపాన్ పరిశ్రమల శాఖ మంత్రి రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ప్రధాని ఆమోదించారు. ఈ వ్యవహారం మొత్తం ప్రధాని షింజో అబెకు పెద్ద తలనొప్పిగా మారిందని అంటున్నారు. యుకో ఒబుచి అనే ఈ మంత్రి వాస్తవానికి జపాన్ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి కూడా అవుతారని ఒక దశలో అంతా భావించారు. అయితే.. ఉన్నట్టుండి ఈ వ్యవహారం బయటపడటం, అది కాస్తా గందరగోళంగా మారడంతో తప్పుకోవాల్సి వచ్చింది. ప్రధానమంత్రి షింజో అబె ఆమె రాజీనామాను వెంటనే ఆమోదించారు. ఈ మొత్తం విషయంపై తాను త్వరలోనే విలేకరుల సమావేశం నిర్వహించి అన్ని విషయాలూ బయట పెడతానని ఒబుచి చెబుతున్నారు. 2012 డిసెంబర్ నెలలో షింజో అబె ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీనామా చేసిన తొలిమంత్రి ఒబుచియే. జపాన్‌లోనే అత్యంత కీలకమైన పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థల లాంటి శాఖలను సమర్థంగా చేపట్టిన మొట్టమొదటి మహిళా మంత్రిగా ఒబుచి బాగా పేరు గడించారు. దాదాపు 58 లక్షల రూపాయల మొత్తాన్ని సౌందర్య సాధనాలు, ఇతర సామగ్రి కోసం ఓ డిపార్ట్మెంట్ స్టోర్‌లో ఖర్చుపెట్టినట్లు తేలింది.