ఆర్నెల్లకోసారి జపాన్ టూర్
* ఏపీ రాయబారులు, జపాన్‌లో కార్యాలయం, చంద్రబాబు నాయుడు, బుల్లెట్ రైలు
* జపాన్‌లోని తెలుగువారితో చంద్రబాబు వెల్లడి
* ఏపీకి రాయబారులుగా వ్యవహరించాలని వారికి పిలుపు
* ఏపీ ప్రభుత్వం తరఫున జపాన్‌లో కార్యాలయం తెరుస్తాం
* జపాన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన
* ఏపీ సీఎం బృందం.. పర్యటన విజయవంతం: కంభంపాటి
సాక్షి, హైదరాబాద్: ఆరు నెలలకోమారు జపాన్ను సందర్శిస్తానని, మరో 15 రోజుల్లో ఒక ప్రతినిధి బృందం ఏపీ నుంచి జపాన్‌లో పర్యటించి పెట్టుబడులకు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందిస్తుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎం జపాన్‌లో పర్యటన ముగించుకుని తిరుగుప్రయాణమయ్యే ముందు.. అక్కడి తెలుగువారు ఆయనను సత్కరించారు.
ఈ సందర్భంగా సీఎం ప్రసంగిస్తూ జపాన్‌లో ఉన్న తెలుగువారు ఆంధ్రప్రదేశ్‌కు రాయబారులుగా వ్యవహరించాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. త్వరలో జపాన్‌లో ఏపీ ప్రభుత్వం తరఫున ఒక కార్యాలయం ఏర్పాటు చేసి పెట్టుబడులను రాబట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.విద్య, వైద్యం తదితర రంగాల్లో వ చ్చే మార్పులను తనకు మూడు నెలలకు ఒకసారి నివేదిక పంపాలని అక్కడి తెలుగు వారిని కోరారు. రాష్ట్రంలో బుల్లెట్ రైలును ప్రవేశ పెడతామని, జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామన్నారు. పెట్టుబడులు పెట్టే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు. భారత్‌కు బయలుదేరే ముందు బాబు టోక్యోలోని నరిటా విమానాశ్రయాన్ని సందర్శించారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు, ప్రభుత్వ సమాచార సలహాదారు పరకాల ప్రభాకర్, ఎంపీ సి.ఎం.రమేశ్, జపాన్‌లో భారత రాయబారి దీపాగోపాలన్ వాద్వాపాల్గొన్నారు.
రాష్ట్రానికి తిరిగి వచ్చిన బాబు బృందం...
ఆదివారం అర్ధరాత్రి జపాన్ బయలుదేరి వెళ్లిన చంద్రబాబు నేతృత్వంలో 19 మంది మంత్రు లు, పారిశ్రామికవేత్తల బృందం శనివారం రాత్రి హైదరాబాద్ నగరానికి తిరిగొచ్చింది. జపాన్ రాజధాని టోక్యోలో భారత కాలమానం ప్రకా రం ఉదయం నాలుగు గంటలకు బయలుదేరిన ఈ బృందం హాంకాంగ్ మీదుగా అర్ధరాత్రి 12.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుం దని ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయ వర్గాలు తొలుత వెల్లడించాయి. అయితే సీఎం బృందం సాయంత్రం ఆరు గంటలకే ఢిల్లీ చేరుకున్నారు. అక్కడ వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి.అశోక్‌గజపతిరాజు, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు స్వాగతం పలికారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న బాబు అక్కడి నుంచి నేరుగా గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ వెళ్లారు. అక్కడ భారత వైద్య మండలి మాజీ చీఫ్ కేతన్‌దేశాయ్ నివాసంలో జరిగే ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొని హైదరాబాద్ చేరుకున్నారు. ఆయనకు బేగంపేటలో అధికారులు స్వాగతం పలికారు.
పర్యటన విజయవంతం: కంభంపాటి
సీఎం నేతృత్వంలో చేపట్టిన జపాన్ పర్యటన విజయవంతమైందని ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు పేర్కొన్నారు. మంత్రి పి. నారాయణ, ఎంపీ సీఎం రమేశ్‌లతో కలిసి ఆయన ఢిల్లీ విమానాశ్ర యంలో విలేకరులతో మాట్లాడారు. ఏపీలో అటోమొబైల్, టెక్స్టైల్ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారని తెలిపారు.