Japanese investments
-
డెల్హివరీలో తగ్గిన సాఫ్ట్‌బ్యాంక్ వాటా
న్యూఢిల్లీ: జపనీస్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ సప్లై చైన్ కంపెనీ డెల్హివరీలో 3.8 శాతం వాటాను విక్రయించింది. బీఎస్ఈ బ్లాక్‌డీల్ సమాచారం ప్రకారం అనుబంధ సంస్థ ఎస్వీఎఫ్ డోర్‌బెల్(కేమన్) ద్వారా 2.8 కోట్ల షేర్లను అమ్మివేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 340.8 సగటు ధరలో విక్రయించిన వీటి విలువ రూ. 954 కోట్లకుపైనే. షేర్లను కొనుగోలు చేసిన సంస్థల జాబితాలో సౌదీ అరేబియన్ మానిటరీ అథారిటీ, సిటీ ఆఫ్ న్యూయార్క్ గ్రూప్ ట్రస్ట్, సొసైటీ జనరాలి, బీఎన్పీ పరిబాస్ ఆర్బిట్రేజ్ తదితరాలున్నాయి. కాగా.. తాజా లావాదేవీ తదుపరి డెల్హివరీలో ఎస్వీఎఫ్ డోర్‌బెల్ వాటా 18.42 శాతం నుంచి 14.58 శాతానికి తగ్గింది. బ్లాక్‌డీల్ వార్తల నేపథ్యంలో డెల్హివరీ షేరు బీఎస్ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 341 వద్ద స్థిరపడింది. -
జపాన్ నుంచి పెట్టుబడుల వెల్లువ: చందా కొచర్
జపనీస్ పెట్టుబడులకు అనుమతులను వేగంగా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని మోడీ హామీ ఇచ్చిన నేపథ్యంలో కోట్లాది డాలర్ల నిధులు భారత్‌లోకి వెల్లువెత్తనున్నాయని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ, ఎండీ చందా కొచర్ పేర్కొన్నారు. మోడీతో పాటు జపాన్ పర్యటనలో పాల్గొంటున్న కొచర్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. రైల్వేలు, స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులు, బయోటెక్నాలజీ, పునరుత్పాదక ఇంధన రంగం, ఎలక్ట్రానిక్స్‌తో పాటు మౌలిక సదుపాయాల రంగంలో భారీగా జపాన్ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందన్నారు. ఈ నిధుల కల్పనలో తమ బ్యాంక్ కూడా కీలక పాత్ర పోషించనుందని ఆమె చెప్పారు. ఈ దిశగా జపనీస్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్‌తో ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారెంటీలు ఇతరత్రా అంశాలపై ఇప్పటికే కసరత్తు కూడా చేస్తున్నట్లు కొచర్ వెల్లడించారు.