పంజాబ్లో ఘోర రోడ్డుప్రమాదం: 9 మంది మృతి
పంజాబ్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో గురువారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కార్మికులను ఎక్కించుకుని వస్తున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న మినీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దాదాపు 9 మంది దుర్మరణం చెందగా, 15 మందికి గాయాలయ్యాయి. అమృత్సర్కు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెహతా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీస్ అధికారి జాశ్దీప్ సింగ్ శైనీ తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.