Jason Behrendorff
-
గ్లోబల్ టీ20 టోర్నీ విజేత టొరంటో నేషనల్స్
గ్లోబల్ టీ20 కెనడా టోర్నీ విజేతగా టొరంటో నేషనల్స్ అవతరించింది. నిన్న (ఆగస్ట్ 11) జరిగిన ఫైనల్స్‌లో టొరంటో టీమ్.. మాంట్రియాల్ టైగర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మాంట్రియాల్ టైగర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేసింది. టైగర్స్ ఇన్నింగ్స్‌లో కోర్బిన్ బోష్ (35), జస్కరన్ సింగ్ (16), అనూప్ రవి (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ ఆటగాళ్లు క్రిస్ లిన్ (3), టిమ్ సీఫర్ట్ (0), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (1) నిరాశపరిచారు. టైగర్స్ ఇన్నింగ్స్‌ను జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ (4-0-8-3) దారుణంగా దెబ్బకొట్టాడు. రొమారియో షెపర్డ్ 2, జునైద్ సిద్దిఖీ, మొహమ్మద్ నవాజ్, నిఖిల్ దత్తా, జతిందర్‌పాల్ తలో వికెట్ పడగొట్టారు.97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేషనల్స్.. ఆండ్రియస్ గౌస్ (58 నాటౌట్), డస్సెన్ (30 నాటౌట్) రాణించడంతో 15 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఓపెనర్లు కొలిన్ మున్రో (0), ఉన్ముక్త్ చంద్ (4) ఆదిలోనే ఔటైనప్పటికీ.. గౌస్, డస్సెన్ జోడీ నేషనల్స్‌ను విజయతీరాలకు చేర్చింది. టైగర్స్ బౌలర్లలో ఒమర్జాయ్, కోర్బిన్ బోష్ తలో వికెట్ పడగొట్టారు.గ్లోబల్ టీ20 కెనడా టోర్నీ నేపథ్యం..కెనడా వేదికగా జరిగే ఈ టోర్నీ 2018లో పురుడుపోసుకుంది. ఆరంభ ఎడిషన్‌లో వాంకోవర్ నైట్స్ విజేతగా నిలిచింది. అనంతరం 2019 ఎడిషన్‌లో వాన్నిపెగ్ హాక్స్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఆతర్వాత మూడేళ్లు టోర్నీకి బ్రేక్ పడింది. తిరిగి గతేడాది ఈ టోర్నీ ప్రారంభమైంది. గత ఎడిషన్‌లో మాంట్రియాల్ టైగర్స్ విజేతగా నిలిచింది. తాజాగా టొరంటో నేషనల్స్ ఛాంపియన్‌గా అవతరించింది. -
ముంబై ఇండియన్స్‌లోకి అరివీర భయంకరుడైన ఫాస్ట్ బౌలర్
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిని తమ పంచన చేర్చుకుంది. గాయపడిన జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ (ఆస్ట్రేలియా) స్థానంలో అరివీర భయంకరుడైన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లూక్ వుడ్‌ను (ఇంగ్లండ్) జట్టులోకి తెచ్చుకుంది. లూక్ వుడ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ తాజా ఎడిషన్‌తో విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు. Luke Wood will join MI for #IPL2024pic.twitter.com/Fcv3zFCKel — CricTracker (@Cricketracker) March 18, 2024 రైట్ హ్యాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో వుడ్ సిద్దహస్తుడు. వుడ్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో సమర్థుడు. పీఎస్ఎల్లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహించిన వుడ్.. తాజా సీజన్లో 11 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. వుడ్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున కూడా మెప్పించాడు. ఇంగ్లండ్ తరఫున 5 టీ20లు ఆడిన వుడ్ ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. వుడ్ అలెక్స్ హేల్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ వీడియోను చూసి ముంబై ఇండియన్స్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. వుడ్ రాబోయే ఐపీఎల్ సీజన్లో బుమ్రాతో కలిసి పేస్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తాడు. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై.. గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంటుంది. -
కరోనా.. విరాళం అందించిన మరో ఆసీస్ క్రికెటర్
ముంబై: భారత్‌లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తూనే ఉన్నారు. కొవిడ్‌పై భారత్ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్ ఆటగాళ్లు తమవంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఇప్పటికే పాట్ కమిన్స్, బ్రెట్ లీ, సచిన్, శిఖర్ ధావన్, జయదేవ్ ఉనద్కత్, రహానె, పాండ్యా బ్రదర్స్‌తోపాటు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యాలు కూడా సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జేసన్ బ్రెండార్ఫ్ కరోనాతో పోరాడుతున్న భారత్‌కు యునిసెఫ్ ద్వారా తన వంతు సాయాన్ని అందించాడు. '' యూనిసెఫ్ ద్వారా భారత్‌కు సాయం చేయనున్నా.. నేను చేసేది చిన్న సాయం కావొచ్చు.. కానీ ఇది ఎంతో కొంత ఉపయోగపడుతుందని నా నమ్మకం. చాలా మంది ఆటగాళ్ల మాదిరిగానే నాకు భారత్ అంటే ప్రత్యేక అభిమానం. అయితే భారత్‌లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. అది నన్ను ఆవేదనకు గురి చేస్తుంది.'' అంటూ చెప్పకొచ్చాడు. జోష్ హాజిల్‌వుడ్ స్థానంలో జట్టులోకి వచ్చిన జేసన్ బ్రెండార్ఫ్ ఇటీవలే క్వారంటైన్‌ను పూర్తి చేసుకున్నాడు. అయితే అతను సీఎస్కే తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈలోగా ఐపీఎల్‌కు కరోనా సెగ తగలడంతో టోర్నీ రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. చదవండి: 'నాన్న తొందరగా వచ్చేయ్.. నిన్ను మిస్సవుతున్నాం' వారిని చూస్తే బాధేస్తోంది.. కానీ ఏం చేయలేని పరిస్థితి -
సీఎస్కేతో ఆసీస్ పేసర్ ఒప్పందం
ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కావడానికి కొన్ని రోజు ముందే ఈ టోర్నీ నుంచి తప్పుకున్నాడు ఆసీస్ పేసర్ జోష్ హజల్‌వుడ్. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడాల్సి ఉన్న ఈ ఆటగాడు బయో బబుల్ నిబంధనలు కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. సుదీర్ఘంగా బయోబబుల్‌లో ఉండడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హజల్‌వుడ్ తెలిపాడు. గత 10 నెలల నుంచి క్వారంటైన్, బయో బబుల్‌లో ఎక్కువగా ఉండటం వల్ల ఫ్యామిలీకి దూరం కావాల్సి వస్తుందని, ఐపీఎల్‌తో అది ఇంకా కష్టంగా ఉంటుందని స్పష్టం చేసి మరీ ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు. కాగా, అతని స్థానంలో తాజాగా బెహ్రెన్‌డార్ఫ్‌ను సీఎస్కే తీసుకుంది. ఆస్ట్రేలియాకే చెందిన మరో పేసర్ బెహ్రెన్‌డార్ఫ్‌తో హజల్‌వుడ్ స్థానాన్ని భర్తీ చేయాలని భావించిన ఆ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇప్పటివరకూ 11 వన్డేలు, 7 అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉన్న బెహ్రెన్‌డార్ఫ్.. గత రెండేళ్ల నుంచి జాతీయ జట్టుకు ఆడటం లేదు. ఇదిలా ఉంచితే, 2021 బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో పెర్త్ స్కాచర్స్‌కు ఆడిన బెహ్రెన్‌డార్ఫ్.. ఆ జట్టు ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 2019 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ సీజన్లో ముంబై తరఫున ఐదు వికెట్లు మాత్రమే సాధించి నిరాశపరిచాడు. ఇప్పుడు సీఎస్కే ఆడి తన సత్తాను నిరూపించుకోవాలనుకుంటున్నాడు. శనివారం(ఏప్రిల్ 10వ తేదీన) సీఎస్కే-ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. ఇక్కడ చదవండి: అందుకే అతడిని జట్టులోకి తీసుకున్నాం.. నాకు నమ్మకం ఉంది! IPL 2021: ఈ ఆటగాళ్లకు ఇదే చివరి సీజన్ కాబోతోందా?! NEWS: @ChennaiIPL sign Jason Behrendorff as replacement for Josh Hazlewood. @Vivo_India #VIVOIPL More details 👉 https://t.co/XIZSzQZqSb pic.twitter.com/8lRptsIv5c — IndianPremierLeague (@IPL) April 9, 2021