ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ కీలక ఆటగాడిని తమ పంచన చేర్చుకుంది. గాయపడిన జేసన్ బెహ్రెన్‌డార్ఫ్ (ఆస్ట్రేలియా) స్థానంలో అరివీర భయంకరుడైన లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ లూక్ వుడ్‌ను (ఇంగ్లండ్) జట్టులోకి తెచ్చుకుంది. లూక్ వుడ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ తాజా ఎడిషన్‌తో విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నాడు.
Luke Wood will join MI for #IPL2024pic.twitter.com/Fcv3zFCKel
— CricTracker (@Cricketracker) March 18, 2024
రైట్ హ్యాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో వుడ్ సిద్దహస్తుడు. వుడ్ బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంలో సమర్థుడు. పీఎస్‌ఎల్‌లో పెషావర్ జల్మీకి ప్రాతినిథ్యం వహించిన వుడ్.. తాజా సీజన్‌లో 11 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. వుడ్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున కూడా మెప్పించాడు. ఇంగ్లండ్ తరఫున 5 టీ20లు ఆడిన వుడ్ ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. వుడ్ అలెక్స్ హేల్స్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ఈ వీడియోను చూసి ముంబై ఇండియన్స్ అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. వుడ్ రాబోయే ఐపీఎల్ సీజన్‌లో బుమ్రాతో కలిసి పేస్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేస్తాడు. కాగా, ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభంకానుంది. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే.. ఆర్సీబీ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్‌ను మార్చి 24న ఆడనుంది. అహ్మదాబాద్‌లో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై.. గుజరాత్ టైటాన్స్‌ను ఢీకొంటుంది.
Comments
Please login to add a commentAdd a comment