నవోదయ ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంపు
న్యూఢిల్లీ: జవహర్ నవోదయ విద్యాలయాల్లో (జేఎన్వీ) ఖాళీగా ఉన్న వివిధ పోస్టులకు దరఖాస్తు చేసుకోడానికి గడువును అక్టోబరు 16కు పెంచారు. వాస్తవానికి గడువు సోమవారంతో ముగిసింది.
వెబ్సైట్లో సాంకేతిక సమస్య వల్ల దరఖాస్తు పూర్తి చేయలేకపోయామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌కు కొందరు అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. దరఖాస్తు చేసినవారు మార్పులు చేసుకోడానికి అక్టోబర్ 17 నుంచి 20 వరకు అవకాశం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు.