Jayant Manglik
-
ఆర్బీఐ పాలసీ, ఐఐపీ డేటాలతో తీవ్ర హెచ్చుతగ్గులు
న్యూఢిల్లీ: రిజర్వుబ్యాంక్ వెల్లడించబోయే పరపతి విధానం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ వారం మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని, ఈ మూడు అంశాలు మార్కెట్‌ను తీవ్ర హెచ్చుతగ్గులకు గురిచేయవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ 7న వెలువడబోయే ఆర్బీఐ పరపతి విధాన సమీక్ష మార్కెట్‌కు కీలకమని రిలయన్స్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ హితేశ్ అగర్వాల్ అన్నారు. ఆర్బీఐ పాలసీ తర్వాత ఏప్రిల్ 10న వెలువడబోయే ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి గణాంకాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను శాసించవచ్చన్నది అంచనా. ఈ రెండు ఘటనలతో వడ్డీ రేట్ల ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, ఆటోమొబైల్, రియల్టీలకు చెందిన షేర్లు భారీ హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని రిలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం అమెరికాలో వెలువడిన జాబ్స్ డేటాకు తొలుత ఈ సోమవారం మన మార్కెట్లు స్పందిస్తాయి. మార్చి నెలలో అమెరికాలో ఉద్యోగాల సంఖ్య 1.5 లక్షలకు తగ్గినట్లు డేటా వెలువడింది. ఈ సంఖ్య అక్కడి అంచనాలకంటే బాగా తక్కువ. ఆ దేశపు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించినట్లు ఈ డేటా సూచిస్తోంది. తదుపరి ట్రిగ్గర్ కార్పొరేట్ ఫలితాలు. అటు తర్వాత మార్కెట్ ట్రెండ్‌ను కార్పొరేట్ల క్యూ4 ఆర్థిక ఫలితాలు నిర్దేశిస్తాయి. 2015 మార్చితో ముగిసే త్రైమాసికపు ఆర్థిక ఫలితాలకు ఐటీ దిగ్గజం టీసీఎస్ ఏప్రిల్ 16న శ్రీకారం చుడుతుంది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఏప్రిల్ 24న ఫలితాలు వెల్లడిస్తుంది. ఇటీవల వరుసగా కేంద్ర బడ్జెట్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కమిటీ సమావేశం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత వంటి అంశాల తర్వాత ర్యాలీకి అవసరమైన ట్రిగ్గర్ల కోసం మార్కెట్ వేచి చూస్తున్నదని అషికా స్టాక్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ పరాస్ బోథురా చెప్పారు. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 2.91 శాతం ర్యాలీ జరిపింది. -
గణాంకాలు, విదేశీ సంకేతాలే కీలకం
న్యూఢిల్లీ: చివరి దశకు చేరిన కార్పొరేట్ ఫలితాలు, ఆర్థిక గణాంకాలు, విదేశీ సంకేతాలే ఈ వారం మార్కెట్లకు దిక్సూచిగా నిలవనున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. మంగళవారం(12న) జూన్ నెలకు పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ)తోపాటు, జూలై నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు వెలువడనున్నాయి. ఇక గురువారం(14న) జూలై టోకు ధరల ఆధారిత ధరల(డబ్ల్యూపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం కారణంగా శుక్రవారం(15న) స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో ట్రేడింగ్ 4 రోజులకే పరిమితంకానుంది. అమ్మకాలు కొనసాగుతాయ్... గత వారం మార్కెట్లలో కనిపించిన ప్రతికూల పరిస్థితులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ పంపిణీ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ చెప్పారు. అయితే ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీకి 7,450 వద్ద మద్దతు లభిస్తుందని అంచనా వేశారు. క్యూ1 ఫలితాలు చివరి దశకు చేరిన ప్రస్తుత పరిస్థితుల్లో విదేశీ సంకేతాలు కీలకంగా నిలవనున్నాయని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు ఇరాక్ సంక్షోభంపై దృష్టిపెడతారని పేర్కొన్నారు. రిజల్ట్స్‌కు దిగ్గజాలు రెడీ ఈ వారం పలు దిగ్గజ కంపెనీలు క్యూ1(ఏప్రిల్-జూన్) ఫలితాలను ప్రకటించనున్నాయి. జాబితాలో సన్ ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఐవోసీ, ఆయిల్ ఇండియా, హిందాల్కో, ఎన్ఎండీసీ, టాటా పవర్, సిప్లా, జేపీ అసోసియేట్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి. కాగా, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ముడిచమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు వంటి అంశాలు కూడా సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు పేర్కొన్నారు. గడచిన శుక్రవారం(8న) డాలరుతో మారకంలో రూపాయి ఐదు నెలల కనిష్టమైన 61.74కు చేరగా, మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ నాలుగు వారాల కనిష్టం 25,329 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ స్వల్ప కాలంలో మార్కెట్ల నడకను టోకుధరలు, రిటైల్ ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు నిర్దేశిస్తాయని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా అభిప్రాయపడ్డారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఇరాక్ మిల టెంట్ స్థావరాలపై వైమానిక దాడులకు ఆదేశించిన నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాలను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలిస్తారని అత్యధిక శాతంమంది నిపుణులు వ్యాఖ్యానించారు. మరోవైపు ఉక్రెయిన్, గాజా ఆందోళనలు కొనసాగుతుండటం కూడా సెంటిమెంట్ బలహీనపడటానికి కారణమైనట్లు తెలిపారు. ఈ పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరల పెరుగుదలకు దారితీస్తున్నాయన్నారు. -
హెచ్చుతగ్గులుంటాయ్!
న్యూఢిల్లీ: ఈ వారం మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. క్రిస్మస్ సందర్భంగా బుధవారం(25న) మార్కెట్లకు సెలవు. ఇక గురువారం(26న) డిసెంబర్ సిరీస్ ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్ట్‌ల గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను రోలోవర్ చేసుకున్నప్పటికీ మార్కెట్లు ఒడిదొడుకులను చవిచూస్తాయని విశ్లేషకులు అంచనా వేశారు. డిసెంబర్ సిరీస్ ముగియనున్న కారణంగా ఇన్వెస్టర్లు తమ పొజిషన్లకు హెడ్జింగ్ పెట్టుకోవడం మంచిదని రెలిగేర్ సెక్యూరిటీస్ రిటైల్ డిస్ట్రిబ్యూషన్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు. స్టాక్ ఆధారంగా పెట్టుబడులకు దిగడం మేలని సూచించారు. రానున్న వారంలో బ్యాంకింగ్, మీడియా, రియల్టీ రంగాలతోపాటు ఎఫ్ఎంసీజీలో కొన్ని షేర్లు వెలుగులో నిలిచే అవకాశముందని అభిప్రాయపడ్డారు. గడచిన వారంలో మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ 364 పాయింట్లు లాభపడి 21,080 వద్ద నిలిచిన సంగతి తెలిసిందే. లావాదేవీలు తగ్గవచ్చు మార్కెట్లలో లావాదేవీల పరిమాణం క్షీణించే అవకాశమున్నదని విశ్లేషకులు పేర్కొన్నారు. క్రిస్మస్ సెల వుల సందర్భంగా విదేశీ ఫండ్ మేనేజర్లు మార్కె ట్లకు దూరంకానున్నారని తెలిపారు. కాగా, ప్రస్తుతానికి మార్కెట్లకు ఊపునిచ్చే అంశాలేవీలేవని, డిసెం బర్ క్వార్టర్‌కు కంపెనీలు ప్రకటించే ఫలితాలు ఇందుకు దోహదపడవచ్చునని వివరించారు. జనవరి రెండో వారం నుంచీ కార్పొరేట్ ఫలితాలు వెలువడనున్నాయి. ఈ వారం కూడా ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీలో జోష్ కనిపించే అవకాశమున్నదని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా పేర్కొన్నారు. సాంకేతికంగా చూస్తే పటిష్టంగా కనిపిస్తున్నదని, 6,320 వద్ద ఎదురయ్యే ప్రధాన అవరోధాన్ని అధిగమించవచ్చునని చెప్పారు. ఆపై 6,370, 6452 స్థాయిలను పరీక్షించవచ్చునని అంచనా వేశారు. అంచనాలకు భిన్నంగా గడిచిన వారంలో అటు అమెరికా ఫెడరల్ రిజర్వ్, ఇటు దేశీయ రిజర్వ్ బ్యాంక్ అంచనాలకు భిన్నంగా పరపతి సమీక్షలను ప్రకటించాయి. 85 బిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీలో 10 బిలియన్ డాలర్లమేర మాత్రమే కోత పెట్టేందుకు ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించగా, రెపో రేటును యథాతథంగా ఉంచేందుకే రిజర్వ్ బ్యాంక్ మొగ్గు చూపింది. దీంతో ఇకపై రాజకీయ పరిణామాలు, కార్పొరేట్ ఫలితాలపై మార్కెట్లు దృష్టిపెడతాయని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ హెడ్ దీపేన్ షా పేర్కొన్నారు. సమీపకాలానికి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు సెంటిమెంట్‌పై ప్రభావం చూపుతాయని మరికొంతమంది విశ్లేషకులు తెలిపారు. విదేశీ మార్కెట్ల పనితీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు కూడా కీలకంగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. మరోవైపు మన్నికైన వస్తువులకు కొత్త ఆర్డర్లు, హౌసింగ్ అమ్మకాలు, నిరుద్యోగ గణాంకాలు వంటి అంశాలపై ఆధారపడి అమెరికా మార్కెట్లు స్పందించనున్నట్లు తెలిపారు. పలు అంతర్జాతీయ మార్కెట్లపై అమెరికా సూచీలు ప్రభావం చూపే విషయం విదితమే.