రేపటి నుంచి నట్టల నివారణ మందు పంపిణీ
– పశుసంవర్ధకశాఖ జేడీ దుర్గయ్య
మహబూబ్నగర్ వ్యవసాయం : రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా చేపట్టిన నట్టల నివారణ కార్యక్రమాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు, జిల్లాలోని 44లక్షల గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధకశాఖ జేడీ దుర్గయ్య ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 37.30 లక్షల గొర్రెలు, 6.87లక్షల మేకలకు నట్టల నివారణ మందులను తాగించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. 185 పశువైద్య బృందాల ద్వారా వీటిని తాగించనున్నట్లు ఆయన తెలిపారు. గొర్రెలు, మేకల కాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.