ముందస్తు బెయిల్‌కు మనోరమాదేవి పిటిషన్
బిహార్: సస్పెన్షన్‌కు గురైన జేడీయూ మహిళా ఎమ్మెల్సీ మనోరమా దేవి శుక్రవారం ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. బిహార్‌లో అమలులో ఉన్న మద్యపాన నిషేధాన్ని అతిక్రమించడంతో ఆమెపై అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. బెయిల్ పిటిషన్‌ను స్వీకరించిన జిల్లా కోర్టు... దీనిపై సోమవారం విచారణ జరపనుంది. కాగా మనోరమా దేవి కొద్దిరోజులగా అజ్ఞాతంలో ఉన్న విషయం తెలిసిందే. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
ఈ నేపథ్యంలో మనోరమా దేవి లొంగిపోకుంటే... ఆమె ఆస్తులను సీజ్ చేసే యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మనోరమా దేవి నివాసంలో సీజ్ చేసిన మద్యం బాటిళ్లను పరీక్షల నిమిత్తం పాట్నాలోని ల్యాబ్‌కు పంపించనున్నారు. కాగా ఎమ్మెల్సీ కుమారుడు రాకీ యాదవ్... తన వాహనాన్ని ఓవర్ టేక్ చేశాడనే నెపంతో ఓ యువకుడిని కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈకేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు.