jet airways bus
-
ఎయిర్ షోలో జెట్ విమానాల ఢీ
సాక్షి, బెంగళూరు: భారత వాయుసేనలో వైమానిక విన్యాసాల బృందానికి చెందిన రెండు జెట్ విమానాలు గాల్లో ఢీకొని కుప్పకులాయి. బెంగళూరు దగ్గర్లోని యలహంక వైమానిక స్థావరంలో ‘ఎయిరో ఇండియా షో’ వైమానిక ప్రదర్శన నేడు ప్రారంభంకానుంది. షో రిహార్సల్స్‌లో భాగంగా మం గళవారం ఉదయం సూర్యకిరణ్ ఎరోబాటిక్ టీం జెట్ విమానాలు విన్యాసాలు చేస్తున్నాయి. తలకిందులుగా ప్రయాణిస్తున్న ఒక జెట్ విమానం.. మరో విమానం మీద నుంచి వెళ్తూ విన్యాసం చేస్తోంది. తలకిందులుగా వెళ్తున్న విమానం ఒక్కసారిగా అదుపుతప్పి కిందనున్న విమానం వెనుకభాగంపై పడింది. దీంతో రెండు విమానాలూ అదుపుతప్పి వాయువేగంతో నేలను ఢీకొని మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో సాహిల్ గాంధీ అనే పైలట్ ప్రాణాలు కోల్పోగా, ఇద్దరు పైలట్లు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ, వీరిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. వీరిని వెంటనే మరో విమానంలో బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్ కమాండ్ ఆస్పత్రికి తరలించారు. రెండు విమానాలు యలహంక ఎయిర్‌బేస్ సమీపంలోని ఘంటిగా నహళ్లి గ్రామంలో పడ్డాయి. జెట్ విమానాల శిథిలాలు అదృష్టవశాత్తు ఇళ్ల మధ్య ఖాళీ స్థలంలో పడటంతో అక్కడి స్థానికులెవరూ గాయపడలేదు. -
విమానాన్ని ఢీకొట్టిన బస్సు
-
విమానాన్ని ఢీకొట్టిన బస్సు
కోల్ కతా: కోల్ కతా విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగిఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని జెట్ ఎయిర్ వేస్ కు చెందిన బస్సు ఢీకొట్టింది. దీంతో విమానం కొంత భాగం ధ్వంసమైంది. ఆ సమయంలో విమానంలో ప్రయాణీకులు లేరు. ఈ ఘటన తెలిసి ఒక్కసారిగా విమానాశ్రయ అధికారులు ఉలిక్కి పడ్డారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయాలవడంగానీ చోటుచేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. బస్సులో ప్యాసింజర్స్‌ను విమానం వద్దకు తీసుకెళ్లే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల విమానాశ్రయంలోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ వల్లే ఈ ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం అసోంలోని సిల్చార్ కు వెళ్లాల్సి ఉంది. బస్సు డ్రైవర్ ను ప్రశ్నిస్తున్నారు.