Jewellery Stores
-
ఆ గోల్డ్‌కి పెరుగుతున్న క్రేజ్..రోజుకో నగతో మహిళామణులు..
శుభకార్యం ఏదైనా... మహిళలు ప్రత్యేకంగా దృష్టి సారించేది ఆభరణాలపైనే. చీర రంగు, డిజైన్‌కు తగ్గట్టుగా ఆభరణాలు ధరించాలనుకుంటారు. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ బంగారం ధరలు చుక్కలనంటుతుండంతో ప్రత్యామ్నాయ ఆభరణాల వైపు చూస్తున్నారు. చాలా మంది ‘వన్‌గ్రామ్ గోల్డ్’ వైపు మొగ్గుచూపుతున్నారు. ధర తక్కువగా ఉండటం...వివిధ మోడళ్లలో అందుబాటులో ఉండటంతో ఎక్కువ మంది వీటిని ధరించేందుకు ఇష్టపడుతున్నారు. రోజుకో మోడల్ నగతో ధగధగ మెరుస్తున్నారు. సాక్షి, పుట్టపర్తి: బంగారం.. కొనాలంటే ధర భయపెడుతోంది...ఎలాగోలా కొందామనుకున్నా కావాల్సిన మోడల్ అందుబాటులో ఉండటం లేదు. నచ్చిన మోడల్ నగ కొనుగోలు చేసినా నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. అందువల్లే బంగారు ఆభరణాల కొనుగోలు ఇప్పుడో పెద్ద ప్రహసనం. అందువల్లే సామాన్య, మధ్యతరగతి వారు ప్రత్యామ్నాయ ఆభరణాల వైపు మొగ్గు చూపుతున్నారు. జిగేల్ మంటున్న వన్‌గ్రామ్ గోల్డ్ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయలేని సామాన్యులు, మధ్య తరగతి మహిళలకు ఇప్పుడు వన్‌గ్రామ్ గోల్డ్ కళ్లముందు జిగేల్‌మంటోంది. ధరలు కూడా అందుబాటులో ఉండటం..కోరిన డిజైన్లలో దొరుకుతుండటంతో వన్‌గ్రామ్ గోల్డ్‌కే జై కొడుతున్నారు. చైన్ స్నాచింగ్ కేసులు నేపథ్యంలో చాలా మంది తాళిబొట్టు గొలుసు కూడా వన్‌గ్రామ్ గోల్డ్‌నే వాడుతున్నారు. వీటిని ధరించడం సులువు, రవాణాలో ఇబ్బంది ఉండదు, పైగా చోరీకి గురైనా నష్టం పెద్దగా ఉండదు. దీనికి తోడు రకరకాల డిజైన్లు ఆకట్టుకుంటాయి. తక్కువ మొత్తానికే భారీ తూకం నగలు ఇంటికి చేరుతాయి. అందువల్లే చాలా మంది వన్‌గ్రామ్ గోల్డ్ బెస్ట్ అంటుండగా...జిల్లాలో దుకాణాలు భారీగా వెలిశాయి. గతంలో బెంగళరు, హైదరాబాద్ వంటి ప్రముఖ నగరాల్లోనే ఎక్కువగా కనిపించే వన్‌గ్రామ్ గోల్డ్ నగల దుకాణాలు ఇప్పుడు హిందపురం, ధర్మవరం తదితర పట్టణాల్లోనూ మిరుమిట్లు గొలుపుతున్నాయి. సంపన్నులదీ అదే దారి ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ర.55 వేలపైనే పలుకుతుండగా... ఏ ఆభరణం కొనాలన్నా ర.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి. కొనుగోలు చేసిన వారు కూడా చోరుల భయంతో ధరించలేని దుస్థితి. అందువల్లే ఇంట్లో బంగారం ఎక్కువ ఉన్న వాళ్లు బ్యాంకుల్లోని లాకర్లలో ఉంచుతున్నారు. శుభకార్యాల సమయంలో వాటిని తీసుకుని ధరిస్తున్నారు. ఆ వెంటనే మళ్లీ లాకర్లలోనే భద్రపరుస్తున్నారు. ఇదంతా ఎందుకు అనుకునే సంపన్నులు వన్‌గ్రామ్ గోల్డ్ నగలను ధరించేందుకు ఇష్ట పడుతున్నారు. బంగారం కొనుగోలు కోసం దాచిన డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడి పెడుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా డిజైన్లు బంగారు ఆభరణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు వివిధ డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. ఉంగరాల ధర .వెయ్యి నుంచి ర.10 వేల వరకు ఉంటోంది. మహిళలు ధరించే లాంగ్ చైన్లు రూ .5 వేల నుంచి ర.20 వేల వరకు రకరకాల డిజైన్లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మధ్య తరగతి వారంతా విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ కళాశాలకు వెళ్లే యువతులు రెండు, మూడు సెట్ల నగలు కొంటున్నారు. ఫలితంగా అమ్మకాలు బాగా పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వ్యాపారం బాగుంది వన్‌గ్రామ్ గోల్డ్‌తో చేసిన ఆభరణాలకు నాలుగైదు ఏళ్లుగా విపరీతమైన డిమాండ్ పెరిగింది. పట్టణ వాసులకు పోటీగా పల్లె వాసులు కొనుగోలు చేస్తున్నారు. ధరల విషయంలో రాజీ పడకుండా నచ్చి.. మెచ్చిన డిజైన్లను సొంతం చేసుకుంటున్నారు. రోజూ కనీసం ఐదుగురు చొప్పున వన్ గ్రామ్ గోల్డ్‌తో చేసిన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు. – సాజిద్, బంగారు నగల వ్యాపారి, ధర్మవరం కాలేజీ విద్యార్థులే ఎక్కువ కరోనా లాక్డౌన్ తర్వాత వన్‌గ్రామ్ గోల్డ్ ఆభరణాలకు డిమాండ్ పెరిగింది. గ్రామీణ ప్రాంత వాసులు విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. అందులో కూడా కాలేజీ విద్యార్థినులే అధికంగా ఉంటున్నారు. దొంగల బారి నుంచి నష్టపోకుండా ఉండేందుకు విరివిగా వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. – రమేశ్, వ్యాపారి, హిందూపురం (చదవండి: చీర కట్టుతో మతి పోగొడుతున్న.. ఈ ముద్దుగుమ్మ ధరించిన చీర ఎంతంటే..) -
మళ్లీ బంగారం బంద్
పుదుచ్చేరితోపాటు రాష్ట్రంలో బుధవారం నుంచి మళ్లీ బంగారం దుకాణాలన్నీ మూత పడ్డాయి. హఠాత్తుగా దుకాణాలు మూత పడడంతో కొనుగోళ్ల నిమిత్తం వచ్చిన వాళ్లు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. సాక్షి, చెన్నై : బంగారం కొనుగోళ్లు, ఉత్పత్తి వ్యవహారంలో కొత్త నిబంధనల్ని విధిస్తూ కేం ద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. రూ. రెండు లక్షలకు పైగా బంగారం కొంటే పాన్ కార్డును తప్పని చేశారు. అలాగే, ఉత్పత్తి మీద ఒక్క శాతం పన్ను పోటు విధించారు. దీంతో బంగారం వర్తకుల్లో ఆగ్రహం రేగింది. గత నెల ఓ రోజు సమ్మె చేపట్టారు. కేంద్రం నుంచి స్పందన లేని దృష్ట్యా, ఈనెల రెండో తేదీ నుంచి దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్రంతో పాటుగా పుదుచ్చేరిలోని బంగారు దుకాణాలు, జ్యువెలరీస్, అతి పెద్ద షోరూం లు మూత బడ్డాయి. పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డట్టు అయింది. అదే సమయంలో దుకాణాల్లో, ఉత్పత్తి కేంద్రాల్లో పనిచేస్తున్న రోజూ వారి వేతన కార్మికులకు పనులు కరవయ్యా యి. ఎట్టకేలకు స్పందించిన కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. దీంతో ఆరో తేదీ నుంచి మళ్లీ దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, తమ కు హామి ఇచ్చినట్టుగా ఇచ్చి కేంద్రం విస్మరించడంతో వర్తకుల్లో ఆక్రోశం రగిలింది. బుధవారం నుంచి మళ్లీ దుకాణలన్నీ మూసి వేశా రు. మదురై, తిరునల్వేలి, తిరుచ్చి తదితర నగరాల్లోని మూత బడ్డాయి. చిన్న పెద్ద దుకాణాలు, షోరూమ్స్, మాల్స్, జ్యువెలరీస్ అన్ని హఠాత్తుగా మూత పడ్డా యి. అన్ని దుకాణాల ఎదుట నిరవధిక సమ్మె అన్న బోర్డుల్ని తగిలించారు. ఈ సమాచారం తెలియక శుభకార్యాల నిమిత్తం బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్లకు నిరాశే మిగిలింది. దుకాణాలు మూత పడడంతో సమ్మె కొలిక్కి వచ్చేదెప్పుడో అన్న ఎదురు చూపుల్లో పడాల్సిన పరిస్థితి. ఇక, చెన్నైలోని ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న టీ నగర్, పురసైవాక్కం పాంతాల్లో ఉన్న షోరూంలు, జ్యువెలరీస్, దుకాణాలు మూత పడడంతో కొనుగోలు దారులు వెనుదిరగక తప్పలేదు.