పుదుచ్చేరితోపాటు రాష్ట్రంలో బుధవారం
నుంచి మళ్లీ బంగారం దుకాణాలన్నీ మూత
పడ్డాయి. హఠాత్తుగా దుకాణాలు మూత
పడడంతో కొనుగోళ్ల నిమిత్తం వచ్చిన వాళ్లు
నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
సాక్షి, చెన్నై : బంగారం కొనుగోళ్లు, ఉత్పత్తి వ్యవహారంలో కొత్త నిబంధనల్ని విధిస్తూ కేం ద్రం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. రూ. రెండు లక్షలకు పైగా బంగారం కొంటే పాన్ కార్డును తప్పని చేశారు. అలాగే, ఉత్పత్తి మీద ఒక్క శాతం పన్ను పోటు విధించారు. దీంతో బంగారం వర్తకుల్లో ఆగ్రహం రేగింది. గత నెల ఓ రోజు సమ్మె చేపట్టారు. కేంద్రం నుంచి స్పందన లేని దృష్ట్యా, ఈనెల రెండో తేదీ నుంచి దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా రాష్ట్రంతో పాటుగా పుదుచ్చేరిలోని బంగారు దుకాణాలు, జ్యువెలరీస్, అతి పెద్ద షోరూం లు మూత బడ్డాయి.
పన్నుల రూపంలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడ్డట్టు అయింది. అదే సమయంలో దుకాణాల్లో, ఉత్పత్తి కేంద్రాల్లో పనిచేస్తున్న రోజూ వారి వేతన కార్మికులకు పనులు కరవయ్యా యి. ఎట్టకేలకు స్పందించిన కేంద్రం చర్చలకు ఆహ్వానించింది. దీంతో ఆరో తేదీ నుంచి మళ్లీ దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, తమ కు హామి ఇచ్చినట్టుగా ఇచ్చి కేంద్రం విస్మరించడంతో వర్తకుల్లో ఆక్రోశం రగిలింది. బుధవారం నుంచి మళ్లీ దుకాణలన్నీ మూసి వేశా రు. మదురై, తిరునల్వేలి, తిరుచ్చి తదితర నగరాల్లోని మూత బడ్డాయి.
చిన్న పెద్ద దుకాణాలు, షోరూమ్స్, మాల్స్, జ్యువెలరీస్ అన్ని హఠాత్తుగా మూత పడ్డా యి. అన్ని దుకాణాల ఎదుట నిరవధిక సమ్మె అన్న బోర్డుల్ని తగిలించారు. ఈ సమాచారం తెలియక శుభకార్యాల నిమిత్తం బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్లకు నిరాశే మిగిలింది. దుకాణాలు మూత పడడంతో సమ్మె కొలిక్కి వచ్చేదెప్పుడో అన్న ఎదురు చూపుల్లో పడాల్సిన పరిస్థితి. ఇక, చెన్నైలోని ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న టీ నగర్, పురసైవాక్కం పాంతాల్లో ఉన్న షోరూంలు, జ్యువెలరీస్, దుకాణాలు మూత పడడంతో కొనుగోలు దారులు వెనుదిరగక తప్పలేదు.
మళ్లీ బంగారం బంద్
Published Thu, Mar 10 2016 2:37 AM | Last Updated on Sun, Sep 3 2017 7:21 PM
Advertisement
Advertisement