జిప్మర్లో ‘అనంత’ విద్యార్థికి సీటు
జేఎన్టీయూ : జవహర్లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్టుగ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్)లో అనంతపురం నగరానికి చెందిన తప్పెట తేజస్విణి మెడికల్ సీటు సాధించింది.
జిప్మర్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో 134వ ర్యాంకు (99.90 శాతం) సాధించింది. ఫలితాలు గత నెలలో విడుదలయ్యాయి. జాతీయ స్థాయిలో అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్న మెడికల్ సంస్థ జిప్మర్ ఒకటి. పాండిచ్చేరిలో ప్రెంచ్ ప్రభుత్వం 1823లో ఈ సంస్థను ఏర్పాటు చేసింది. మెడిసిన్లో ర్యాంకు తెచ్చుకోవడమే అరుదైన విషయం. మెడిసిన్ ప్రవేశ పరీక్షలో అనంతపురానికి చెందిన తప్పెట తేజస్విణి అత్యుత్తమ ప్రతిభతో మెరుగైన ర్యాంకు సాధించింది. అరుదైన రికార్డును ఆమె కైవసం చేసుకుంది. గతంలో ఏపీ ఎంసెట్–2016 ఫలితాల్లో తప్పెట తేజస్విణి మెడిసిన్లో రాష్ట్ర స్థాయి 29వ ర్యాంకు సాధించింది. ఎస్వీయూ రీజియన్లో 4వ ర్యాంకు (లోకల్ ర్యాంకు ) దక్కింది. ఏపీ ఎంసెట్లో 160 మార్కులకు గాను 147 మార్కులు సాధించి అత్యుత్తమ ర్యాంకు సాధించింది. తెలంగాణ ఎంసెట్–1లో మెడిసిన్లో 16 వర్యాంకు, తెలంగాణ ఎంసెట్–2లో మెడిసిన్లో 7 వ ర్యాంకు, తాజాగా తెలంగాణ ఎంసెట్–3లో మూడో ర్యాంకు (160కి 151 మార్కులు) సాధించారు. జిప్మర్లో 134వ ర్యాంకు సాధించి, అడ్మిషన్ పొందింది.