20 మంది అమ్మాయిలను వేధించాడు..
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ పాఠశాల డైరెక్టర్ 15 ఏళ్ల బాలికను శారీరకంగా వేధించి, ఆ బాలికకు చెందిన నగ్న దృశ్యాల వీడియోను సోషల్ మీడియాలో పెట్టాడు. నిందితుడు జితేందర్ సింగ్ యాదవ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాఠశాలలో 20 మందికి పైగా బాలికలను సింగ్ వేధించినట్టు ఆరోపణలు వచ్చాయి.
సింగ్ గత ఏడాది కాలంగా తనను శారీరకంగా వేధిస్తున్నట్లు బాధితురాలు తెలిపింది. రోజులో ఏదో ఒక సమయంలో ఆఫీసు రూమ్ కు పిలిచి తన కోర్కె తీర్చాలని వేధించేవాడని, లేదంటే వీడియోను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడని బాధితురాలు వాపోయింది. అంతేగాక పరీక్షల్లో ఫెయిల్ చేసి కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించినట్లు తెలిపింది. పాఠశాలకు చెందిన 20 మందికి పైగా అమ్మాయిలను సింగ్ శారీరకంగా వేధించాడని ఆమె ఆరోపించింది. గురువారం ఫోన్ చేసి తన నివాసానికి రావాలని చెప్పాడని, అందుకు తాను నిరాకరించినట్టు చెప్పింది. ఆ తర్వాత వీడియోను వాట్సాప్ లో పోస్ట్ చేశాడని, తన కుటుంబాన్నంతటినీ చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు చెప్పింది.