jivan reddy
-
హుజురాబాద్‌లో పోటీకి కేసీఆర్ సై అంటే.. బరిలోకి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోటీచేస్తే ఆయనకు పోటీగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి బరిలోకి దిగుతారని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బొరెడ్డి అయోధ్యరెడ్డి స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో దళితబంధు ఇస్తామని చెప్పిన సీఎం కేసీఆర్..ఆయన దత్తత గ్రామం వాసాలమర్రిలో సైతం ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఢిల్లీలో ప్రధాని మోదీని కేసీఆర్ కలవగానే హుజూరాబాద్ ఉపఎన్నికలు వాయిదా పడ్డాయని, దీంతో ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి పోస్టు కూడా వాయిదా పడిపోయిందని ఆరోపించారు. బీజేపీ, టీఆర్ఎస్లు కలసి లోపాయికారీగా పనిచేస్తున్నాయనడానికి ఇదే నిదర్శనమన్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మోదీని కలసి కేసీఆర్ అక్రమాలపై విచారణకు ఆదేశించేలా పట్టుబట్టాలని డిమాండ్ చేశారు. -
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేస్తోంది
సాక్షి, సంగారెడ్డి : ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉంటుందన్న విషయం మర్చిపోయి టీఆర్ఎస్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకోవడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న జీవన్ రెడ్డిని విద్యావంతులు, ప్రజాస్వామ్య వాదులంతా కలిసి గెలిపించాలని కోరారు. జీవన్ రెడ్డి గెలుపు రాబోయే పార్లమెంట్, ఇతర ఎన్నికలల్లో ఉత్సాహాన్ని ఇస్తుందన్నారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువత, నిరుద్యోగుల ఆకాంక్షలు నేరవేరడం లేదన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయని భావిస్తే.. ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఇప్పటి వరకు ఒక్క డీఎస్సీ కూడా వేయలేదన్నారు. పీఆర్సీ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వ ఉద్యోగులు నిరత్సాహంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో పట్టాభద్రులు ప్రభుత్వాన్ని తట్టిలేపేలా తీర్పు ఇవ్వాలని కోరారు. -
సీఎల్పీ ఉపనేతలుగా గీతా, జీవన్, కోమటిరెడ్డి
ఏడుగురు నేతలకుకార్యవర్గంలో చోటు కార్యదర్శి పోస్టుకే భట్టి పరిమితం జానా తీరుపై డీఎస్ అసంతృప్తి హైదరాబాద్: కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యవర్గ జాబితాను సీఎల్పీ నేత కె.జానారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఇందులో ఏడుగురు నేతలకు చోటు కల్పించారు. సీనియర్ ఎమ్మెల్యేలు జె.గీతారెడ్డి, టి.జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉప నాయకులుగా నియమించారు. అలాగే కార్యదర్శులుగా మల్లు భట్టి విక్రమార్క, టి.రామ్మోహన్‌రెడ్డి, కోశాధికారిగా పువ్వాడ అజయ్‌కుమార్, పార్టీ విప్‌గా వి.సంపత్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని శాసనసభ స్పీకర్ మధుసూదనాచారికి కూడా జానారెడ్డి తెలిపారు. అయితే ఈ జాబితాపై కాంగ్రెస్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో తనను కనీసం సంప్రదించకపోవడంపై మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిపి సీఎల్పీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం పార్టీలో ఆనవాయితీగా వస్తోందని, ఎన్నికల ముందు వరకు కొనసాగిన కార్యవర్గమే ఇందుకు నిదర్శనమని డీఎస్ సన్నిహితులు పేర్కొన్నారు. ఈసారి జానారెడ్డి ఆ సంప్రదాయాన్ని పక్కనపెట్టారని విమర్శించారు. ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సీఎల్పీ కార్యవర్గాన్ని డీఎస్ నియమించుకుంటారన్న ఉద్దేశంతోనే తాజా జాబితాలో వారికి చోటు కల్పించలేదని జానారెడ్డి సన్నిహితులు చెబుతున్నారు. డీఎస్ వర్గీయులు మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఖ్య మొత్తం 30కి మించే పరిస్థితి లేదని, అలాంటప్పుడు వేర్వేరు కార్యవర్గాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం సీఎల్పీ జాబితాపై పెదవి విరుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, రెడ్యానాయక్, చిన్నారెడ్డిలకు ఇందులో చోటు కల్పించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. సామాజిక సమతుల్యం లేదని, ఎస్టీ నేతకు ఇందులో చోటు లేకపోవడం బాధాకరమని వాఖ్యానించారు. పీఏసీ రేసులో ఆ నలుగురు శాసనసభ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కేటాయించనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు ఆ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో డీకే అరుణతోపాటు రెడ్యానాయక్, రాంరెడ్డి వెంకటరెడ్డి, కిష్టారెడ్డి ఉన్నారు. అయితే డీకే అరుణకు మినహా మిగిలిన ముగ్గురు నేతలకు చెరో ఏడాది చొప్పున పీఏసీ చైర్మన్ పదవిని కట్టబెట్టాలని జానారెడ్డి యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆ నేతలకు హామీ ఇచ్చినట్లు సమాచారం.