job notofications
-
మహిళలూ.. పోలీసులవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చాక తొలిసారి రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయబోతోంది. ఎస్ఐ, కానిస్టేబుల్, ఇతర తత్సమాన కేటగిరీల్లో మొత్తం 17 వేలకు పైగా పోస్టులను భర్తీ చేస్తామని ఇటీవలే ప్రకటించింది. కొత్త జోనల్లో కానిస్టేబుల్ పోస్టులన్నీ జిల్లా కేడర్‌కు చెందినవే కావడంతో ఈసారి మహిళా ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. నియామకాల్లో భాగంగా సివిల్ కేటగిరీలో మహిళలకు 33 శాతం, ఆర్మ్డ్ రిజర్వ్‌లో 10 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం అమలు చేస్తోందని చెబుతున్నారు. పురుషులతో పోలిస్తే ఫిజికల్ టెస్టుల్లో మహిళలకు కొంత మినహాయింపులు ఉంటాయని, వీటిని వినియోగించుకొని ఖాకీ కొలువులు సాధించాలని సూచిస్తున్నారు. 15,575 కానిస్టేబుల్.. 538 ఎస్ఐ పోస్టులు తాజాగా 16,113 పోలీస్ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో 15,575 కానిస్టేబుల్, 538 ఎస్ఐ పోస్టులున్నాయి. పురుష అభ్యర్థుల తరహాలో మహిళా అభ్యర్థులకు కూడా భౌతిక, శారీరక దారుఢ్య పరీక్షలుంటాయి. కాబట్టి ప్రిలిమినరీ పరీక్షలకు సిద్ధమవుతూనే సమాంతరంగా ఫిజికల్ టెస్ట్‌లకు కూడా సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వివాహితులు, పిల్లలు న్న మహిళా అభ్యర్థులు కొంచెం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుందని, లేదంటే శారీరక దారు ఢ్య పరీక్షల వేళ కళ్లు తిరిగి పడిపోవడం, డీహైడ్రేషన్ లాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎండాకాలం దృష్ట్యా ఉదయం 7 గంటల్లోపు, సాయంత్రం 5 గంటల తర్వాతే మైదానంలో ప్రాక్టీస్ చేయాలని సూచిస్తున్నారు. వ్యాయామానికి తగిన పోషకాహారం తీసుకోవాలంటున్నారు. 3 కమిషనరేట్ల పరిధిలో.. పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమైన వారిని పోలీస్ శాఖ ఎంపిక చేసి ఉచితంగా శిక్షణ అందిస్తోంది. గ్రేటర్‌లోని 3 కమిషనరేట్లలో సైబరాబాద్‌లోని బాలా నగర్, శంషాబాద్ జోన్లలో శిక్షణ ప్రారంభమైంది. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్‌లో స్క్రీనింగ్ టెస్టులు పూర్తయ్యాయి. త్వరలోనే శిక్షణ ప్రారంభం కానుంది. బాలానగర్ జోన్లో 1,050 మందికి శిక్షణ ఇస్తుండగా ఇందులో 300 మంది మహిళలు న్నారు. శంషాబాద్‌లో 1,400 మంది ట్రైనింగ్‌లో ఉండగా 500 మంది మహిళా అభ్యర్థులున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రెండు బ్యాచ్‌లు చేసి శిక్షణ ఇస్తున్నారు. 60–70 రోజుల పాటు శిక్షణ ఉంటుంది. రాచకొండ పరిధిలో ఉచిత శిక్షణ కార్యక్రమానికి 9 వేల మంది దరఖాస్తులు చేసుకోగా 6,085 మంది అభ్యర్థులు స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. ఇందులో 1,383లకు పైగా మహిళా అభ్యర్థులున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రీ రిక్రూట్మెంట్ ఎలిజిబులిటీ టెస్టుకు 16 వేల మంది హాజరయ్యారు. ఇందులో 5 వేల మందికి పైగా మహిళలున్నారు. మూడు దశల్లో పరీక్షలు ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్ట్‌లకు 3 దశల్లో పరీక్షలుంటాయి. తొలుత ప్రిలిమినరీ పరీక్ష, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ టెస్ట్ ఉంటుంది. పరుగు పందెం, లాంగ్ జంప్, షాట్‌పుట్ దేహదారుఢ్య పరీక్షలుంటాయి. మూడింటిలో రెండింటిలో అర్హత సాధించాలి. ఇందులో 100 మీటర్ల పరుగులో అర్హత తప్పనిసరి. తర్వాత తుది రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ప్రకటిస్తారు. అర్హతలివే.. ♦ఎస్ఐ పోస్టులకు ఏదైనా డిగ్రీ, తత్సమాన అర్హత ఉండాలి. ఏజెన్సీ ప్రాంతాలలోని అభ్యర్థులకు అర్హతలో సడలింపులుంటాయి. వయసు 21–25 ఏళ్ల మధ్య ఉండాలి. ♦కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. వయసు 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. ♦ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయసులో ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఇతర రంగాల్లోని మహిళలకు ఆదర్శం మహిళలు పోలీస్ ఉద్యోగం సాధిస్తే మహిళా సాధికారతే కాదు.. సమాజంలో ఆదర్శంగా ఉంటారు. ఇతర రంగాల్లోని స్త్రీలకు స్ఫూర్తిగా నిలుస్తారు. త్వరలోనే మాదాపూర్ జోన్లో ఉచిత శిక్షణ ప్రారంభిస్తాం. – కె. శిల్పవల్లి, డీసీపీ, మాదాపూర్ జోన్ మీపై మీరు నమ్మకం పెట్టుకోండి పోలీస్ ఉద్యోగం అనేది శారీరక, మానసిక సామర్థ్యానికి పరీక్ష. అందుకే మీపై మీరు నమ్మకం పెట్టుకోండి. ఇతరుల కంటే మీరేం తక్కువ కాదనే ఆత్మవిశ్వాసంతో సిద్ధంకండి. –రక్షిత కృష్ణమూర్తి, డీసీపీ, మల్కాజ్గిరి జోన్ శారీరక కొలతలు ఎత్తు: 152.5 సెంటీమీటర్లు బరువు: 45.5 కిలోల కంటే తక్కువ ఉండొద్దు. ఫిజికల్ టెస్టులివే 100 మీటర్ల పరుగు: 26 సెకన్లు లాంగ్ జంప్: 2.5 మీటర్లు షాట్‌పుట్ (4 కిలోలు): 3.75 మీటర్లు (మహిళా అభ్యర్థులకు హై జంప్, 800 మీటర్ల పరుగు ఉండవు) -
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న పేద నిరుద్యోగులకు శుభవార్త!
-
ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారు
సిరిసిల్ల: రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకుండా ముఖ్యమంత్రి కేసీఆర్, ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా సోమవారం ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటలో మాట్లాడుతూ, విద్యావలంటీర్లను, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి ఉసురు సీఎం కేసీఆర్‌కు తగులుతుందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతామన్నారు. చాలా పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే, సీఎం కేసీఆర్ తన బొమ్మను పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. దళితుల కోసం ప్రధాని మోదీ ‘స్టాండప్ ఇండియా’పథకాన్ని అమలు చేస్తున్నారని, పరిశ్రమల స్థాపనకు ఒక్కో దళితుడికి రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు ష్యూరిటీ, వడ్డీ లేకుండా రుణాలిచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారని వివరించారు. దళితబంధు పథకాన్ని రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, బతుకమ్మ పండుగను కూడా డిస్కో డ్యాన్స్‌లా చేశారని, బతుకమ్మ పండుగతో కవితకు ఏం సంబంధమని సంజయ్ ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ అంటే సీఎం కేసీఆర్‌కు వణుకుపుడుతుందని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుమతి ఇస్తే, పాకిస్తాన్ వెళ్లి కాషాయ జెండా ఎగురవేస్తామన్నారు. కర్ణాటక ఎంపీ మునుస్వామి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, మాజీ మంత్రి సుద్దాల దేవయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలి: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల్లేక అల్లాడుతున్నారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలని, ప్రతి ఒక్క ఖాళీని భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలంటూ గురువారం నగరంలోని ఇందిరాపార్క్ వద్ద ఆమె నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్ విజయమ్మ, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ప్రొఫెసర్ కంచె ఐలయ్య, ఐజేయూ జాతీయ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, వివిధ జిల్లాల, వర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు, పలు జిల్లాల నుంచి షర్మిల పార్టీ నేతలు, అనుచరులు పాల్గొని మద్దతు తెలిపారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం షర్మిల మాట్లాడారు. 40 లక్షల మంది ఎదురుచూపులు ప్రత్యేక తెలంగాణ సాధన పోరాటంలో ముందున్న విద్యార్థులు, యువకులు ఈరోజు ఉద్యోగాల్లేక, కుటుంబాలను పోషించలేక, పెళ్లిళ్లు కాక ఆత్మాభిమానాన్ని చంపుకుని బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్శిటీ విద్యార్థి సునీల్‌నాయక్, సిరిసిల్లలో మహేందర్‌యాదవ్‌లు ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్‌లో చలనం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో.. చందమామల్లాంటి మన పిల్లలు ఉద్యోగాల్లేక చనిపోతున్నారని మొసలి కన్నీరు కార్చిన ముఖ్యమంత్రికి ఇప్పుడు ఇంతమంది చనిపోతుంటే కన్పించడం లేదా? అని నిలదీశారు. దాదాపు 40 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం వేచిచూస్తున్నారని తెలిపారు. 1.91 లక్షల ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేయడం లేదో చెప్పాలన్నారు.కేసీఆర్‌ది గుండెనా? బండరాయా? అని ప్రశ్నించారు. దీక్షలో ఇందిరా శోభన్, ఏపూరి సోమన్న, పిట్టా రామిరెడ్డి, ర్యాలీ చంద్రశేఖర్‌రాజు, వినోద్, వాడుక రాజగోపాల్, ఓయూ విద్యార్థి జేఏసీ నేత నవీన్‌యాదవ్, కాకతీయ యూనివర్సిటీ జేఏసీ నేత సాయి, బి వెంకటేశ్వరరాజు తదితరులు పాల్గొన్నారు. బీఆర్కే భవన్ వద్ద లాఠీఛార్జ్ ఇందిరా పార్క్ వద్ద దీక్షను కొనసాగించడానికి అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరించడంతో, లోటస్‌పాండ్ వద్ద దీక్ష కొనసాగించేందుకు వైఎస్ షర్మిల ధర్నా చౌక్ నుంచి పాదయాత్ర చేపట్టారు. అయితే బీఆర్కే భవన్ వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ప్రత్యేక వాహనంలో ఎక్కించే ప్రయత్నం చేయడంతో కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. ఈ సందర్భంగా తోపులాట జరగడం, పోలీసులు కొంత దురుసుగా వ్యవహరించడంతో ఒక దశలో ఆమె స్పృహతప్పి పడిపోయారు. దుస్తులు స్వల్పంగా చిరిగిపోవడంతో పాటు ఎడమ చేతికి గాయమైంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులు దొరికినవారిని వ్యాన్లలో ఎక్కించి తీసుకెళ్లారు. అనంతరం షర్మిలను లోటస్‌పాండ్‌కు తరలించారు. ఆ తర్వాత కార్యకర్తలను తెలుగు తల్లి ఫ్లై ఓవర్ ప్రాంతంలోనే వదిలిపెట్టారు. న్యాయం జరిగే వరకు పోరాటం లోటస్‌పాండ్‌లో దీక్షను కొనసాగించిన షర్మిల.. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రతినబూనారు. తనకు గాయం అయ్యిందంటూ, తనపై మరోసారి చేయిపడితే ఊరుకోబోనని హెచ్చరించారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. చదవండి: వైఎస్ షర్మిల దీక్షను అడ్డుకున్న పోలీసులు -
యూపీఎస్సీ ఉద్యోగాలు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్‌లలో సైంటిస్ట్, జియాలజిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ‘కంబైన్డ్ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ - 2015’ నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టుల సంఖ్య: 269 విభాగాలు: 1. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జియాలజిస్ట్ గ్రూపు ఎ-150, జియోఫిజిసిస్ట్ గ్రూపు ఎ- 40, కెమిస్ట్ గ్రూపు ఎ-50) 2. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ - జూనియర్ హైడ్రోజియాలజిస్టు (సైంటిస్ట్ బి) గ్రూపు ఎ-29. అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణత. వయోపరిమితి: జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పోస్టులకు 21-32 ఏళ్లు, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్‌లోని పోస్టులకు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 20 వెబ్సైట్: www.upsconline.nic.in ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: - ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-5 - కెమికల్ ఇంజనీరింగ్-2 - ఎల్‌వీడీ లెసైన్స్‌తో ఆటో మొబైల్ ఇంజనీరింగ్-1 - మెకానికల్ ఇంజనీరింగ్-2 - ఆర్ అండ్ ఏసీ సబ్జెక్ట్‌తో మెకానికల్ ఇంజనీరింగ్-4 అర్హతలు : సంబంధిత విభాగంలో ఫస్ట్‌క్లాస్ మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 13 దరఖాస్తుల హార్డ్‌కాపీలను పంపించడానికి చివరి తేది: మార్చి 23 వెబ్సైట్: http://sdsc.shar.gov.in ఎన్హెచ్ఐడీసీఎల్ నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్హెచ్ఐడీసీఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైట్ ఇంజనీర్ , సైట్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల సంఖ్య: 40 అర్హతలు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్/ సైట్ ఇంజనీర్ పోస్టులకు 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఏడాది పని అనుభవం ఉండాలి. సైట్ ఇంజనీర్ పోస్టులకు 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు సంబంధిత రంగంలో అయిదేళ్ల పని అనుభవం అవసరం. ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 5 వెబ్సైట్: www.nhidcl.com