యూపీఎస్సీ ఉద్యోగాలు | job notifications | Sakshi
Sakshi News home page

యూపీఎస్సీ ఉద్యోగాలు

Published Wed, Feb 25 2015 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM

job notifications

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్‌లలో సైంటిస్ట్, జియాలజిస్ట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ‘కంబైన్డ్ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్ - 2015’ నోటిఫికేషన్ విడుదల చేసింది.
 పోస్టుల సంఖ్య: 269
 విభాగాలు:
 1. జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జియాలజిస్ట్ గ్రూపు ఎ-150,   జియోఫిజిసిస్ట్ గ్రూపు ఎ- 40,  కెమిస్ట్ గ్రూపు ఎ-50)
 
 2. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ - జూనియర్ హైడ్రోజియాలజిస్టు  (సైంటిస్ట్ బి) గ్రూపు ఎ-29.
 అర్హత: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణత.
 వయోపరిమితి: జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పోస్టులకు 21-32 ఏళ్లు, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్‌లోని పోస్టులకు 21-35 ఏళ్ల మధ్య ఉండాలి.
 
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ద్వారా.
 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మార్చి 20
 వెబ్‌సైట్: www.upsconline.nic.in
 
 ఇస్రో
 ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లో టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 పోస్టుల వివరాలు:
 - ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్-5
 - కెమికల్ ఇంజనీరింగ్-2
 - ఎల్‌వీడీ లెసైన్స్‌తో ఆటో మొబైల్ ఇంజనీరింగ్-1
 - మెకానికల్ ఇంజనీరింగ్-2
 - ఆర్ అండ్ ఏసీ సబ్జెక్ట్‌తో మెకానికల్ ఇంజనీరింగ్-4

 అర్హతలు : సంబంధిత విభాగంలో ఫస్ట్‌క్లాస్ మార్కులతో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
 వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
 ఎంపిక: విద్యార్హతల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 13
 దరఖాస్తుల హార్డ్‌కాపీలను పంపించడానికి
 చివరి తేది: మార్చి 23
 వెబ్‌సైట్: http://sdsc.shar.gov.in
 
 ఎన్‌హెచ్‌ఐడీసీఎల్

 నేషనల్ హైవేస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సైట్ ఇంజనీర్ , సైట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 ఖాళీల సంఖ్య: 40
 అర్హతలు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్/ సైట్
 ఇంజనీర్  పోస్టులకు 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో ఉత్తీర్ణతతో పాటు సంబంధిత రంగంలో ఏడాది పని అనుభవం ఉండాలి. సైట్ ఇంజనీర్  పోస్టులకు 60 శాతం మార్కులతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమాతో పాటు సంబంధిత రంగంలో అయిదేళ్ల పని అనుభవం అవసరం.
 ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: మార్చి 5
 వెబ్‌సైట్: www.nhidcl.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement