ఆ నేడు సెప్టెంబర్ 7, 1979
ప్రసారాలు ప్రారంభం!
టీవీలో స్పోర్ట్స్ చూసేవాళ్ల ఫ్యావరేట్ చానెల్ ఇ.ఎస్.పి.ఎన్. (ఎంటర్టైన్మెంట్ అండ్ స్పోర్ట్స్ ప్రోగ్రామింగ్ నెట్వర్క్). ఈ కేబుల్ నెట్వర్క్ ప్రసారాలు ప్రారంభమైన రోజు ఇది. ఇ.ఎస్.పి.ఎన్. అమెరికాలో ఉంది.
దీని ప్రధాన భాగస్వామి వాల్ట్ డిస్నీకంపెనీ. ఇ.ఎస్.పి.ఎన్. ప్రస్తుత అధ్యక్షుడు జాన్ స్కిప్పర్. ప్రధాన కేంద్రకార్యాలయాలు బ్రిస్టల్, కనెక్టికట్లలో ఉన్నాయి.