కోర్టులో మహిళా డ్రైవర్ల నియామకం
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారత నినాదాన్ని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి టి.రజని ఆచరణలో చేసి చూపించారు. నాంపల్లి క్రిమినల్కోర్టులో మొదటిసారిగా ఇద్దరు మహిళా డ్రైవర్లను నియమించారు. ఆమె నేతృత్వంలో బుధవారం ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది. డ్రైవర్లుగా పురుషులు మాత్రమే చేయగలరన్న అపోహను పక్కనపెట్టి ఇద్దరు మహిళలను డ్రైవర్లుగా న్యాయవ్యవస్థ విధుల కోసం ఎంపిక చేశారు.