judges suspensions
-
'న్యాయం కోరితే సస్పెండ్ చేయడం బాధాకరం'
ఢిల్లీ: తెలంగాణ జడ్జిల సస్పెన్షన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కరీంనగర్ ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులు న్యాయం చేయాలని కోరితే సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల సస్పెన్షన్పై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సదానంద గౌడ్ లను కలుస్తామని వినోద్ చెప్పారు. -
నేడు న్యాయాధికారుల సమావేశం
హైదరాబాద్: జడ్జిల సస్పెన్షన్పై తెలంగాణ వ్యాప్తంగా లాయర్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిపై హైదరాబాద్లో న్యాయాధికారులు మంగళవారం సమావేశం కానున్నారు. జడ్జిల సస్పెన్షన్లు, భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. మరో వైపు తెలంగాణ న్యాయవాదుల ఆందోళనతో హైకోర్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం హైకోర్టులోనికి అనుమతిస్తున్నారు.