
'న్యాయం కోరితే సస్పెండ్ చేయడం బాధాకరం'
ఢిల్లీ: తెలంగాణ జడ్జిల సస్పెన్షన్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని కరీంనగర్ ఎంపీ వినోద్ డిమాండ్ చేశారు.
ఢిల్లీలో మంగళవారం ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులు న్యాయం చేయాలని కోరితే సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు. హైకోర్టు విభజన, న్యాయమూర్తుల సస్పెన్షన్పై కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, సదానంద గౌడ్ లను కలుస్తామని వినోద్ చెప్పారు.