
సాక్షి, హైదరాబాద్: రైల్వే శాఖలో వివిధ కేటగిరీలలో ఖాళీగా ఉన్న 3,15,823 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రైల్వేశాఖలో ఉన్న ఖాళీ ఉద్యోగాల జాబితాను రాజ్యసభలో కేంద్ర రైల్వేమంత్రి అశ్విన్ వైష్ణవ్ విడుదల చేశారని, ఇందులో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే 17,134 వివిధ కేటగిరీల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని వివరించారు.
రాష్ట్రం నుంచి ఎన్నికైన నలుగురు బీజేపీ ఎంపీలు ఖాళీగా ఉన్న రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులు రైల్వే ఉద్యోగాలు పొందే విధంగా బీజేపీ ఎంపీలు కృషి చేయాలని సూచించారు. కేంద్రం వెంటనే రైల్వే శాఖతో పాటు ఇతర శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం చర్యలు తీసుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment