jumma
-
నేడు మొదటి జుమ్మా
చార్మినార్: రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం జరిగే జుమ్మా ప్రార్థనలు సైతం ఇళ్లలోనే చేసుకునేందుకు ముస్లింలు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం లాక్డౌన్లోనేరంజాన్ ఉపవాస దీక్షలు, రోజుకు అయిదుసార్లు ప్రార్థనలు ఇళ్లలోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రంజాన్ మాసంలో మొదటి జుమ్మా ప్రార్థనలు జరగనున్నాయి. వాస్తవంగా మక్కా మసీదు వేదికగా ఈ సామూహిక ప్రత్యేక ప్రార్థనలు ఇమాం ముస్లింలతో నిర్వహిస్తారు. వేలాది మంది వీటికి హాజరవుతారు. ప్రార్థనల అనంతరం యౌముల్ ఖురాన్ సభ జరుగుతుంది. ప్రస్తుతం ఇవి రద్దయ్యాయి. జుమ్మా ప్రార్థనలను ఇళ్లలోనే నిర్వహించనున్నారు. ఉపవాస దీక్షలకు అవసరమైన పండ్లు, ఫలాలు అక్కడక్కడా అందుబాటులో ఉన్నాయి. చార్మినార్, మక్కా మసీదు వద్ద ఫ్రూట్స్ మార్కెట్ కొనసాగడం లేదు. లాక్డౌన్తో పాతబస్తీలోని ప్రధాన వీధులతో పాటు అంతర్గత వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు, షోరూంలు మూసి ఉన్నాయి. -
అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జుమా హతం
పేష్వార్: అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అల్కాయిదా ముఖ్య నేత అద్నన్ అల్ జుమా హతమయ్యాడు. పాకిస్తాన్లోని దక్షిణ వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో చేపట్టిన సైనిక చర్యలో జుమాను తుదముట్టించినట్టు పాక్ సైన్యం శనివారం వెల్లడించింది. ఈ సైనిక దాడిలో జుమాకు చెందిన అనుచరులూ హతమయ్యారని పేర్కొంది. అమెరికాలోని న్యూయార్క్ సబ్ వే సిస్టంకు బాంబు పెట్టేందుకు జుమా కుట్ర పన్నడంతో జుమా కోసం 2009 నుంచి అమెరికా వెతుకుతోంది. అతని తలపై 50 లక్షల డాలర్ల రివార్డునూ ప్రకటించింది. అమెరికాలో జరిగిన 9/11 దాడి సూత్రధారుల్లో జుమా కూడా ఒకరనిఆ దేశం అనుమానం. కాగా, ఈ దాడిలో ఒక సైనికుడు సహా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు సైనికాధికారులు వెల్లడించారు. తమ గడ్డపై ఉన్న ఉగ్రవాదులను ఏరివేస్తామని ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని పాక్ ఆర్మీ తెలిపింది.