అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జుమా హతం | America most wanted terrorist jumma killed in pakistan | Sakshi
Sakshi News home page

అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జుమా హతం

Published Sun, Dec 7 2014 2:33 AM | Last Updated on Thu, Apr 4 2019 3:41 PM

అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జుమా హతం - Sakshi

అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది జుమా హతం

పేష్వార్: అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, అల్‌కాయిదా ముఖ్య నేత అద్నన్  అల్ జుమా హతమయ్యాడు. పాకిస్తాన్‌లోని దక్షిణ వజీరిస్తాన్ గిరిజన ప్రాంతంలో చేపట్టిన సైనిక చర్యలో జుమాను తుదముట్టించినట్టు పాక్ సైన్యం శనివారం వెల్లడించింది. ఈ సైనిక దాడిలో జుమాకు చెందిన అనుచరులూ హతమయ్యారని పేర్కొంది.

అమెరికాలోని న్యూయార్క్ సబ్ వే సిస్టంకు బాంబు పెట్టేందుకు జుమా కుట్ర పన్నడంతో జుమా కోసం 2009 నుంచి అమెరికా వెతుకుతోంది.  అతని తలపై 50 లక్షల డాలర్ల రివార్డునూ ప్రకటించింది. అమెరికాలో జరిగిన 9/11 దాడి సూత్రధారుల్లో జుమా కూడా ఒకరనిఆ దేశం అనుమానం. కాగా, ఈ దాడిలో ఒక సైనికుడు సహా మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు సైనికాధికారులు వెల్లడించారు.  తమ గడ్డపై ఉన్న ఉగ్రవాదులను ఏరివేస్తామని ఏ ఒక్కరినీ విడిచిపెట్టబోమని పాక్ ఆర్మీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement