
చార్మినార్: రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం జరిగే జుమ్మా ప్రార్థనలు సైతం ఇళ్లలోనే చేసుకునేందుకు ముస్లింలు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌లోనేరంజాన్ ఉపవాస దీక్షలు, రోజుకు అయిదుసార్లు ప్రార్థనలు ఇళ్లలోనే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రంజాన్ మాసంలో మొదటి జుమ్మా ప్రార్థనలు జరగనున్నాయి. వాస్తవంగా మక్కా మసీదు వేదికగా ఈ సామూహిక ప్రత్యేక ప్రార్థనలు ఇమాం ముస్లింలతో నిర్వహిస్తారు. వేలాది మంది వీటికి హాజరవుతారు. ప్రార్థనల అనంతరం యౌముల్ ఖురాన్ సభ జరుగుతుంది. ప్రస్తుతం ఇవి రద్దయ్యాయి. జుమ్మా ప్రార్థనలను ఇళ్లలోనే నిర్వహించనున్నారు. ఉపవాస దీక్షలకు అవసరమైన పండ్లు, ఫలాలు అక్కడక్కడా అందుబాటులో ఉన్నాయి. చార్మినార్, మక్కా మసీదు వద్ద ఫ్రూట్స్ మార్కెట్ కొనసాగడం లేదు. లాక్‌డౌన్‌తో పాతబస్తీలోని ప్రధాన వీధులతో పాటు అంతర్గత వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు, షోరూంలు మూసి ఉన్నాయి.