భారత హాకీ జట్టుకు నిరాశ
చాంగ్జౌ (చైనా) : జూనియర్ మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆదివారం మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 2-3 గోల్స్ తేడాతో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. దీంతో వచ్చే సంవత్సరం జరగనున్న జూనియర్ వరల్డ్ కప్‌కు టీమిండియా అర్హత సాధించలేకపోయింది. భారత్ తరఫున నమితా టోపో, లిలిమా మిన్జ్లు గోల్స్ చేశారు. మరోవైపు డిఫెండింగ్ చాంపియన్ చైనా మరోసారి టైటిల్‌ను నిలబెట్టుకుంది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో చైనా పెనాల్టీ షూటౌట్లో 3-1తో జపాన్‌పై నెగ్గింది.