గవర్నర్తో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి భేటీ
ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏసీబీ నోటీసులు ఇస్తుందన్న సమాచారం నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబా సాహెబ్ భోంస్లే భేటీ అయ్యారు. ఏపీ ముఖ్యమంత్రికి నోటీసులు ఇచ్చిన పక్షంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొంటుందని కథనాలు వచ్చిన నేపథ్యంలో వీరిద్దరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉమ్మడి రాజధానిలో తమకు భద్రత లేదని, అందువల్ల ఇక్కడ తమ భద్రతను, శాంతిభద్రతల అంశాన్ని తామే చూసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు తదితరులు ప్రకటనలు చేశారు. అయితే, వాస్తవానికి హైదరాబాద్ నగరంలో సెక్షన్ 8 అంత అవసరం లేదని, శాంతిభద్రతలు ఏ రాష్ట్రానివి ఆ రాష్ట్రం పరిధిలోనే ఉంటాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.