దక్షిణ కొరియాకు కొత్త ప్రధాని
సియోల్: దక్షిణ కొరియాకు కొత్త ప్రధాని వచ్చారు. గతంలో న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన హాంగ్ క్యో అన్ గురువారం కొత్త ప్రధానిగా ఎంపికయ్యారని అక్కడి మీడియా తెలిపింది. మొత్తం 156 మంది చట్ట ప్రతినిధులున్న జాతీయ అసెంబ్లీలో 120 మంది ఆయనను ప్రధానిగా ఆమోదించారు. గతంలో ప్రధానిగా పనిచేసిన లీ వాన్ కూ లంచం తీసుకున్న ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేశారు.
దీంతో గత మే నెల నుంచి దక్షిణ కొరియాకు ప్రధాని సీటు ఖాళీగా ఉంది. దేశంలో మెర్స్ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటం దానిని నిర్మూలించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టడానికి ప్రధాని అనుమతులు అవసరంలాంటి ఎన్నో కారణాలు కొత్త ప్రధాని ఎంపిక వేగవంతం చేసి పూర్తి చేశారు.