Justice Naveen Rao
-
తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ నవీన్‌రావు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ నవీన్‌రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఒక్కరోజే సీజేగా కొనసాగనున్నట్లు కేంద్ర న్యాయశాఖ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకూ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులవడంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా అత్యంత సీనియర్ జడ్జి అయిన జస్టిస్ నవీన్‌కు అప్పగిస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే జస్టిస్ నవీన్‌రావు శుక్రవారం పదవీ విరమణ చేయనుండటంతో ఆయన ఈ ఒక్కరోజే ఆ పదవిలో కొనసాగుతారు. మరుసటి రోజు నుంచి సీనియారిటీలో ముందు వరుసలో ఉన్న జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తారని కేంద్ర న్యాయశాఖ ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలాఉండగా, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. జస్టిస్ లలిత, జస్టిస్ రమేశ్ బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లలిత కన్నెగంటి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.రమేశ్‌ల బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదముద్ర వేశారు. ఏపీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ డి.రమేశ్‌ను, తెలంగాణ హైకోర్టు నుంచి కర్ణాటక హైకోర్టుకు జస్టిస్ లలిత కన్నెగంటిని బదిలీ చేయాలంటూ గత ఏడాది నవంబర్ 24న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన విషయం విదితమే. ఈ సిఫార్సును గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్వీట్ చేశారు. అలాగే ఈ అంశంపై న్యాయ మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. చదవండి: కేజీఎఫ్ స్టైల్లో వీడియో: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే -
మా ఉత్తర్వులంటే లెక్కలేదా?
- ఉత్తర్వులు అమలు చేయకుండా ఇంకా గడువు కోరుతారా? - గనుల శాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం సాక్షి, హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా శంకవరం, ప్రత్తిపాడు మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో అనుమతులు లేకుండా లేటరైట్ ఖనిజ తవ్వకాలు జరుపుతున్న వారిపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై గనుల శాఖ అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా? అంటూ న్యాయస్థానం ముందు హాజరైన అప్పటి గనుల శాఖ డెరైక్టర్ గిరిజాశంకర్‌ను ప్రశ్నించింది. తమ ఆదేశాలను అమలు చేయకుండా, వాటి అమలుకు ఇంకా గడువు కావాలని కోరడంలో ఆంతర్యమేమిటని నిలదీసింది. తమ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో వివరించాలని ఆదేశించింది. అలాగే గిరిజా శంకర్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహారుుంపునిచ్చేందుకు నిరాకరించింది. అనంతరం తదుపరి విచారణను నాలుగు వారాలకు వారుుదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ నవీన్‌రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. -
నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
హైకోర్టు న్యాయమూర్తులు కరీంనగర్ క్రైం/సిరిసిల్ల/మంథని : న్యాయమూర్తులు, న్యాయవాదులు న్యాయవ్యవస్థకు రెండు కళ్లలాంటి వారని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్‌రావు, జిల్లా ఫోర్టు పోలియో జస్టిస్ శేషసారుు అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో మూడు జిల్లాలకు సంబంధించిన ఏసీబీ కోర్టును శనివారం ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ఏసీబీ కేసులు సత్వరంగా పరిష్కారమయ్యేందుకు ఈ కోర్టు ఉపయోగపడుతుందన్నారు. సిరిసిల్లకు జిల్లా అదనపు కోర్టుకు కృషి సిరిసిల్లలో జిల్లా అదనపు కోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని హైకోర్టు న్యాయమూర్తి పి.నవీన్‌రావు పేర్కొన్నారు. సిరిసిల్లలోఅదనపు మున్సిపల్ మెజి స్ట్రేట్ కోర్టును ప్రారంభించారు. న్యా యమూర్తి శేషసాయి మాట్లాడుతూ సిరిసిల్ల చేనేత మన జాతి ఖ్యాతి అని కొనియూడారు. మంథనిలో నూతన కోర్టు సముదాయ భవనాలు, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తులు శనివారం ప్రారంభించారు. జిల్లా జడ్జి నాగమారుతిశర్మ, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గోపు మధుసూదన్‌రావు, ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రావు, బార్ కౌన్సిల్ సభ్యుడు లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్ నీతూప్రసాద్కుమార్, ఎస్పీ శివకుమార్, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంపెల్లి రవీందర్రావు, సిరిసిల్ల సీనియర్ సివిల్ జడ్జి టి.మురళీధర్, డీఎస్పీ దామెర నర్స య్య, సీఐ విజయ్‌కుమార్, మంథని, గోదావరిఖని జడ్జీలు కుమారస్వామి, వెంకటకృష్ణ. మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు హరిబాబు, ప్రధాన కార్యదర్శి సహేందర్‌రెడ్డి, కోశాధికారి రమణకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. రాజన్న ఆలయంలో పూజలు వేములవాడ అర్బన్ : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు నవీన్‌రావు, శేషసాయి శనివారం దర్శించుకున్నారు. శ్రీలక్ష్మీగణపతి పూజ, స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు.